Tuesday, September 10, 2024
spot_img

24 గంటల ఉచిత విద్యుత్ పేరుతో మోసం చేస్తున్న బీ.ఆర్.ఎస్. ప్రభుత్వం..

తప్పక చదవండి
  • అమీన్ పూర్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదురుగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ నాయకులు..

తొమ్మిదేళ్లలో విద్యుత్ సంస్థలను 60 వేల కోట్ల రూపాయల అప్పుల్లో ముంచి.. తన అవినీతికి బలిపెట్టిన ఘనుడు కేసీఆర్. ఈ మోసాలకు నిరసనగా టిపిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పిలువు మేరకు, పటాన్ చెరు నియోజకవర్గ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు అమీన్ పూర్ మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ల ఎదురుగా ధర్నా చేపట్టి.. కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు అశోక్ ముదిరాజ్, మున్సిపాలిటీ ప్రెసిడెంట్ శశిధర్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ మన్నె రవీందర్, నరేష్ యాదవ్, కౌన్సిలర్ మున్నా, సుధాకర్ యాదవ్, జనరల్ సెక్రటరీలు దేవదానం, రమేష్ యాదవ్, కుమ్మరి మహేష్, నాయకులు గోపాల్ రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, మల్లేష్, ఎల్లయ్య, మహేష్ గౌడ్, లక్ష్మణ్, రాములు, హనుమంతు, యూత్ కాంగ్రెస్ సభ్యులు శ్రీకాంత్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు