Friday, September 20, 2024
spot_img

శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు..

తప్పక చదవండి
  • కొనసాగుతున్న భక్తుల రద్దీ..
  • నిండిపోయిన 31 కంపార్టుమెంట్లు..
  • నేటి హుండీ ఆదాయం దాదాపు రూ. 3.5 కోట్లు..
    కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కొలువుతీరిన తిరుమల లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవుల కారణంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో తిరుమలగిరిలోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. నిన్న స్వామివారిని 75,229 మంది భక్తులు దర్శించుకోగా 35,618 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.3.24 కోట్లు వచ్చిందని వెల్లడించారు. కాగా టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో స్వామివారి దర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు