Friday, July 19, 2024

ఐడీబీఐ బ్యాంకులో ఉద్యోగావకాశాలు..

తప్పక చదవండి

మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్ పోస్టుల భర్తీకి ఇండ‌స్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు పోస్టుల‌ను బ‌ట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, బీఈ, బీటెక్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్ క‌లిగి ఉండాలి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆన్‌లైన్‌లో జూన్ 01 నుంచి ప్రారంభంకానుండ‌గా.. జూన్ 15వ‌ తేదీ వరకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 136 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో విద్యార్హతలు, అనుభవం, గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

మొత్తం ఖాళీలు : 136.. పోస్టులు : మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ జనరల్‌ మేనేజర్.. విభాగాలు : ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌, ఫ్రాడ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ఐటీ, లీగల్‌, రిస్క్‌ మేనేజ్‌మెంట్‌, ట్రెజరీ, కార్పొరేట్‌ క్రెడిట్‌, సెక్యూరిటీ తదితరాలు. అర్హతలు : పోస్టుల‌ను బ‌ట్టి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈ, బీటెక్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఈ, ఎంటెక్‌, పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం, టెక్నికల్‌ నాలెడ్జ్ క‌లిగి ఉండాలి. వయస్సు : 21-30 మధ్య ఉండాలి. ఎంపిక : విద్యార్హతలు, అనుభవం, గ్రూప్‌ డిస్కషన్‌/ పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా.. దరఖాస్తు : ఆన్‌లైన్ లో.. చివరి తేదీ : జూన్ 15.. వెబ్‌సైట్ : https://www.idbibank.in/

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు