లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ .. లాహోర్ వీధుల్లో బీఎండబ్ల్యూ బైక్ నడిపాడు. అయితే బైక్ రైడ్ చేసిన వీడియోను అతను తన ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. రెడీ, సెట్, గో అన్న టైటిల్‌తో ఆ వీడియోను పోస్టు చేశాడతను. హెల్మెట్ ధరించి.. రెడ్‌కలర్ స్పోర్ట్స్‌బైక్‌ను నడుపుతున్న బాబర్ ఆజమ్ వీడియోపై విమర్శలు వస్తున్నాయి. త్వరలో జరగనున్న ఆసియాకప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్ పాల్గొననున్నదని, ఇలాంటి సమయంలో బైక్ స్టంట్లు ఎందుకు చేయడమని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాక్ కెప్టెన్ బాధ్యతారాహితంగా వ్యవహరిస్తున్నట్లు కొందరు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.