Monday, May 6, 2024

వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ల‌బూషేన్‌కు షాక్..

తప్పక చదవండి

టెస్టు క్రికెట్‌లో వ‌ర‌ల్డ్ నంబ‌ర్ 1 ఆట‌గాడు మార్నస్ ల‌బూషేన్ ఆట గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. క్రీజులో పాతుకుపోయి ప‌రుగ‌లు వ‌ర‌ద పారించ‌డంలో ఈ ఆస్ట్రేలియ‌న్ బ్యాట‌ర్ సిద్ధ‌హ‌స్తుడు. అలాంటిది ఈ స్టార్ ప్లేయ‌ర్ యాషెస్ సిరీస్‌ లో ఊహించ‌ని రికార్డు సాధించాడు. తొలి టెస్టులో గోల్డ్‌ను డ‌క్‌ గా వెనుదిరిగాడు. క్రీజులోకి వ‌చ్చి ఎదుర్కొన్న తొలి బంతికే ఔట‌య్యాడు. ఐదేళ్ల‌ త‌న‌ టెస్టు కెరీర్‌లో ల‌బూషేన్ గోల్డెన్ డ‌క్‌గా పెవిలియ‌న్ చేర‌డం ఇదే మొద‌టిసారి. 2018లో పాకిస్థాన్‌పై ల‌బూషేన్ టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. రెండో రోజు తొలి సెష‌న్‌లో స్టువార్ట్ బ్రాడ్ ఆసీస్‌కు షాకిచ్చాడు. డేవిడ్ వార్న‌ర్‌(9)ను బౌల్డ్ చేశాడు. ఆ త‌ర్వాత బంతికే ల‌బూషేన్ కీప‌ర్ బెయిర్‌స్టోకి క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. దాంతో, ఆసీస్ రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ప్ర‌స్తుతం ఉస్మాన్ ఖ‌వాజా(36), స్టీవ్ స్మిత్(15) ఆడుతున్నారు. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 330ప‌రుగులు వెన‌క‌బ‌డి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు