Thursday, May 2, 2024

మహిళల సంపూర్ణ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం..

తప్పక చదవండి
  • కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి

ఆరోగ్య తెలంగాణే ద్యేయంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఏ రాష్ట్రంలో లేనివిధంగా వైద్య రంగానికి రాష్ట్ర బడ్జెట్ లో 4-1/2 శాతం నిధులు కేటాయించి, వైద్య రంగంలో అనేక మార్పులు తెచ్చి దేశంలోనే రాష్ట్రాన్ని నంబర్ 1రాష్ట్రంగా రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ తీర్చిదిద్దారని స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కొనియాడారు.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని కొడంగల్ పురపాలక కేంద్రంలోని రాఘవేంద్ర ఫంక్షన్ హాల్లో వైద్య ఆరోగ్య శాఖా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆరోగ్య దినోత్సవ కార్యక్రమానికి స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులతో కల్సి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి హాజరైన గర్భిణులు బాలింతలు తదితరుల నుద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తరువాత వైద్య, ఆరోగ్యరంగంలో జరిగిన విప్లవాత్మక మార్పులను ప్రజలు గమనించాలని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్ర అవతరణ తరువాత జిల్లా కొక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసి దేశంలోనే మెడికల్ సీట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రంగా సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని తీర్చి దిద్దారని ఎమ్మెల్యే అన్నాడు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులకు రాక, గర్భిణీలు ప్రయివేట్ ఆసుపత్రిలను ఆశ్రయించిగా.. సాదారణ ప్రసవాలు జరిగే అవకాశం ఉన్న ప్రయివేట్ ఆసుపత్రి యజమానులు సిజేరియన్ ఆపరేషన్లు చేసి లక్షలు వసూలు చేయగా.. ఆ కుటుంబం అప్పులబారిన పడేదని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశాడు. కానీ సీఎం కేసీఆర్ ముఖ్య మంత్రి అయిన పిదప, కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని సౌకర్యాలు కల్పించాడని ఎమ్మెల్యే అన్నాడు. తల్లి గర్భంలో బిడ్డ పురుడు పోసుకున్న నాటి నుండి ప్రసవం అయ్యేవరకు వారికి అన్ని తానై కెసిఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రషన్ ఇలా అనేక పథకాలు వైద్యరంగంలో ప్రవేశపెట్టి, రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శ వంతంగా సీఎం కేసీఆర్ తీర్చిదిద్దాడని ఎమ్మెల్యే కొనియాడాడు.. కేంద్ర ప్రభుత్వం వైద్య రంగానికై వార్షిక బడ్జెట్ లో 35 లక్షల కోట్లు కేటాయించగా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏరాష్ట్రంలో లేని విధంగా, వార్షిక బడ్జెట్ లో 4-1/2 శాతం (12, 364) కోట్లు వైద్య రంగానికి కేటాయించి దేశంలోనే వైద్యరంగంలో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దిన ఘనత సీఎం కెసిఆర్ కే దక్కిందని ఎమ్మెల్యే ప్రశంసించారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు