Thursday, April 25, 2024

ఏం సాధించారని సంబురాలు చేసుకుంటున్నరు ? మహ్మద్ అశ్రఫ్ అలీ

తప్పక చదవండి

అమరవీరుల ఆకాంక్షలు నేరవేరలేదు సీక్రెట్ జీవోలు, చీకటి ఒప్పందాలతో కేసీఆర్ ప్రభుత్వం నడుస్తున్నదని ఫైర్

టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసిన తర్వాతే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని వైఆర్ ఏ హేచ్ నేషనల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ మహ్మద్ అశ్రఫ్ డిమాండ్ చేశారు. ఆయన మాట్లాడుతూ. టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకేజీ వ్యవహరంలో సిట్ అధికారులు కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి, ఏవోలను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. పేపర్ల లీకేజీలో సీఎంవో అధికారుల హస్తం ఉందని ఆరోపించారు. కమిషన్ చైర్మన్ పై చర్యలు తీసుకోవడంలో గవర్నర్ ఎందుకు వెనకంజ వేస్తున్నారో చెప్పాలని కోరారు. ప్రశ్నపత్రాల లీకేజీ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 10 ఏండ్లలో ఏం సాధించారని దశాబ్ది ఉత్సవాల పేరుతో సంబురాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ ఉత్సవాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. వెంటనే టీఎస్పీఎస్సీ బోర్డును రద్దు చేసిన తర్వాతే గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు