Friday, May 10, 2024

ఈవీఎం వీవీ ప్యాడ్ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్..

తప్పక చదవండి

కొండపాక మండలం కేంద్రంలోగల ఈవీఎం గోదాంలో జరుగుతున్న ఈవీఎం-వివి ప్యాడ్ మిషన్ ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్.. కొండపాక మండలం కేంద్రంలో గల ఈవీఎం గోదాంలో ఈవీఎం- వివి ప్యాడ్ మిషన్ ల ఫస్ట్ లెవల్ చేకింగ్ పనులను స్థానిక రెవెన్యూ, పోలీస్, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి ప్రజా ప్రతినిధుల సమక్షంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా జనరల్ ఎలక్షన్ టూ టిఎస్ఎల్ఎ-2023 అధికారులు ఈవీఎం ఇది ప్యాడ్ మిషన్లను ప్రతి ఒక్కటి అత్యంత జాగ్రత్తగా అందరి సమక్షంలో క్షుణ్ణంగా పరీక్షించాలన్నారు.. ఎలాంటి సమస్యలు ఉన్న పైఅధికారులకు పంపించాలని తెలిపారు. ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రోగ్రాం 15 రోజులపాటు కొనసాగుతుందని, మండల స్థాయిలో తహసిల్దార్ ఆర్ఐ సిబ్బంది ఈ అధికారులకు అన్ని సదుపాయాలు భోజన వసతి, త్రాగునీరు, గోదాం చుట్టూ లైట్లు అమర్చాలి. ప్రతి ఒక్కరిని ఫోటో ఐడి కార్డు ఉంటేనే బయట మొబైల్ ఫోన్ తీసుకున్న తర్వాతనే లోనికి అనుమతించాలి. ఈ రూల్ అందరికీ వర్తిస్తుంది. పోలీస్ అధికారులు బయట పూర్తిగా చెక్ చేసిన తర్వాత లోనికి పంపాలి. ఈ 15 రోజులపాటు గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులకు తెలిపారు. కోతలు లేని కరెంటు అందించాలని, ఎలక్ట్రిసిటీ ఎస్సీకి ఫోన్ ద్వారా తెలిపారు. లోపల ఎలక్షన్ కమిషన్ అధికారులు చేస్తున్న పనులు పరిశీలించారు.. ఎండాకాలం దృష్ట కూలర్ పెట్టాలి. వీఆర్ఏలు అటెండర్లు ప్రతి ఒక్కరు ఫోటో ఐడి కార్డు తప్పనిసరి ఇవ్వాలని, ఎవరు లోనికి వెళ్లినా రికార్డులో డిటెల్స్ ఎంట్రీ చెయ్యాలని, డిటీ ఎలక్షన్ శ్రీనివాస్ కి తెలిపారు. సీసీ కెమెరాలు పనితీరు ఎలాంటి సమస్యలు రాకుండా, నెట్వర్క్ సంబంధించి సమస్యలు రాకుండా చూసుకోవాలని ఈడిఎం ఆనంద్ తెలిపారు. ఎండాకాలం, అగ్ని ప్రమాదాలు జరగకుండా ఎల్లప్పుడూ చూసుకోవాల్సిందే ఫైర్ అధికారులకి తెలిపారు. కలెక్టర్ వెంట ఎలక్షన్ కమిషన్ సిబ్బంది, రెవెన్యూ, పోలీస్, అయా రాజకీయ పార్టీ ప్రజా ప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు