- భూపాలపల్లి, మంథని నియోజక వర్గాల్లో ప్రతీ రాజకీయ పార్టీలు బీసిలకు మాత్రమే టికెట్ ఇవ్వాలి…
- శేఖర్ నాని, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు..
హైదరాబాద్, 31 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకునే నేతలకు బీసీల ఓటే బ్రహ్మస్ర్తం కావాలి. బీసీలను పట్టించుకోని సన్నాసి రాజకీయ నాయకులకు అమాంతం కపట ప్రేమ ఒలకబోసేందుకు సిద్ధమౌతున్నారు. మీ ఆలోచనకు చరమ గీతం పాడుతాం… రానున్న ప్రతి ఎన్నికల విషయంలో తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం దృష్టి సారిస్తాం.. 55 శాతం ఉన్న బీసీలు ఏకమై బీసీ రాజ్యాధికారం దక్కే దిశగా అడుగులు వేయాలని బీసీ సంక్షేమ సంఘం జయశంకర్ జిల్లా అధ్యక్షులు శేఖర్ నాని డిమాండ్ చేశారు.. 2024లో బీసీ ముఖ్యమంత్రి ఐతే తప్పేంటి..? అని ప్రశ్నించారు.. మరీ ముఖ్యంగా భూపాలపల్లి, మంథని నియోజకవర్గాల్లో బీసీలకు మాత్రమే టికెట్ ఇవ్వాలని అన్ని రాజకీయ పార్టీలను శేఖర్ నాని డిమాండ్ చేశారు..
వడ్డించే వాడు మనవాడు ఉంటేనే మనకి అన్ని వసతులు కలుగుతాయి…..
రెడ్డి ,కమ్మ,వెలమ,బ్రాహ్మణ నాయకులకు ఎట్టి పరిస్థితిలో అవకాశం ఇవ్వకుండా బిసి బిడ్డ జాగృతం కావాలి…”మన మేంతో మన కన్ని స్థానాలు” దక్కాలి…అందుకై బిసి ఓటు బ్రహ్మస్ర్తం కావాలి…మన ఓటు మన వారికి దక్కాలి అని శేఖర్ నాని పిలుపునిచ్చారు….