Thursday, September 12, 2024
spot_img

వినాయక మిషన్స్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌16వ స్నాతకోత్సవం, వ్యవస్థాపక దినోత్సవం

తప్పక చదవండి
  • కైలాష్‌ సత్యార్థి, నోబెల్‌ బహుమతి గ్రహీత ముఖ్య అతిథిగా హాజరయ్యారు
  • 3593 మంది అభ్యర్థులు ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు స్వీకరించడానికి అర్హత సాధించారు
  • ర్యాంకులు సాధించిన వారిలో 93 మందికి డాక్టరేట్లు, 94 స్వర్ణపతాకాలు, 85 రజత పతకాలు, 74 కాంశ్యపతకాలు అందజేశారు.

హైదరాబాద్‌ : వినాయక మిషన్స్‌ రిసర్చ్‌ ఫౌండేషన్‌ డీమ్డ్‌ టు బీ యూనివర్శిటీ (విఎంఆర్‌ఎఫ్‌ డియు), తన 16వ వార్షిక స్నాతకోత్సవం, వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని సేలంలోని సీరంగపడిలో వినాయక మిషన్స్‌ కిరుపానంద వారియర్‌ మెడికల్‌ కాలేజ్‌ లోని అన్నపూర్ణ ఆడిటోరియంలో నిర్వహించేరు. డా. ఎ.ఎస్‌. గణేశన్‌, ఛాన్సలర్‌, ఈ స్నాతకోత్సవ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ, ట్రస్టీ అన్నపూరణి షణ్ముగసుందరం, ప్రో-ఛాన్స్‌?లర్‌, డాటో సెరి. డా. ఎస్‌. శరవణన్‌, డైరెక్టర్లు డా. అనురాధ గణేశన్‌, డాటిన్‌ సెరి. కామాచ్చి శరవణన్‌, ఎస్‌. అరుణదేవి చంద్రశేఖర్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ ఎన్‌.వి.చంద్రశేఖర్‌ సమక్షంలో స్నాతకోత్సవ కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్టు ప్రకటించారు, డైరెక్టర్లు శ్రీ ఎన్‌.రామస్వామి, శ్రీ. కె. జగన్నాథన్‌ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యేరు.? వైస్‌-ఛాన్స్‌?లర్‌, ప్రొ. డా. పి.కె. సుధీర్‌, స్వాగతోపన్యాసం ఇచ్చేరు, విశ్వవిద్యాలయం తాలూకు వార్షిక సమగ్ర నివేదికని చదివేరు.? ముఖ్య అతిథిగా హాజరైన, నోబెల్‌ శాంతి బహుమతి గ్రహీత, శ్రీ కైలాష్‌ సత్యార్థి ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘2023లో పట్టభద్రత పూర్తి చేసుకున్నవారికి అభినందనలు. కొత్త పాత్రలు నిర్వహించడంలో, మీ కలలని నిజం చేసుకునే క్రమంలో వచ్చే అవకాశాల్ని అందిపుచ్చుకోండి. ఇంతవరకూ మిమ్మల్ని నడిపించి, ఈ దశకు చేర్చిన వారి ఉమ్మడి శ్రమకి కృతజ్ఞతలు తెలపండి. ముందడుగేసే క్రమంలో పెద్ద విషయాలని ఆశించండి, మీ సామర్థ్యాల్ని తెలుసుకోండి, నిర్ణయాత్మకమైన చర్యకు నడుంకట్టండి. సామాజిక కట్టుబాట్లని ప్రశ్నించడం పరిణామాత్మక మార్పుకు మార్గాలు వేస్తుందని గుర్తుంచుకోండి. కరుణని పెంచుకోండి, ఈరోజు మనం ఎదుర్కొంటున్న ముఖ్యమైన ప్రపంచవ్యాప్త సవాళ్ళని ఎదుర్కోడానికి అది చాలా ముఖ్యం. మహాత్మా గాంధీ బోధించిన, కాలాతీత సూత్రాల నుంచి స్ఫూర్తిపొందండి, అవి మనల్ని మెరుగైన భవిష్యత్తువైపు నడిపిస్తాయి’’ అన్నారు.ఆయా రంగాల్లో వారు అందించిన అసాధారణ సేవలకిగాను తమిళ పండితులు, ప్రసిద్ధ టెలివిజన్‌ వ్యక్తి, పట్టిమండ్రం సంచాలకులు ప్రొ. ఎస్‌. సలోమన్‌ పాప్పియ కి ఆనరరీ డిగ్రీ ఆఫ్‌ డాక్టర్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఆనోరిస్‌ కాసా)ని, పల్లియేటివ్‌ కేర్‌ వైద్యులు, పల్లియం ఇండియా వ్యవస్థాపక ఛైర్మన్‌ ప్రొ.ఎం.ఆర్‌. రాజగోపాల్‌ కు డాక్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ని ఈ సందర్భంగా ప్రదానం చేసారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు