Tuesday, June 18, 2024

అధికారంలోకి రాగానే పెంచిన పన్నులు తగ్గిస్తాం

తప్పక చదవండి
  • ఏటా ఉద్యోగ నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం
  • ప్రజల్లో భయం పోగొట్టేందుకే యువగళం పాదయాత్ర
  • నెల్లూరు జిల్లా కొత్తపల్లిలో ప్రజలో లోకేశ్‌ రచ్చబండ

నెల్లూరు : టిడిపి అధికారంలోకి రాగానే.. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పెంచిన పన్నులన్నీ తగ్గిస్తామని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. నెల్లూరు జిల్లా కొత్తపల్లి గ్రామస్తులతో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.కావలి ప్రజలు చూపించిన ప్రేమ ఎప్పటికీ మరవలేను. 150వ రోజు, 2వేల కిలోవిూటర్లు మైలురాయిని కూడా కావలిలోనే పూర్తి చేసుకున్నాను. ఇకపోతే 153 రోజుల్లో 2000 కిలోవిూటర్లు పాదయాత్ర పూర్తి చేయడం ఆనందంగా ఉందని టీడీపీ యువనేత నారా లోకేశ్‌ అన్నారు. మంగళవారం ఉదయం జిల్లాలోని సిరిపురం క్యాంపు సైటు నుంచి లోకేశ్‌ యువగళం పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో భాగంగా కొత్తపల్లి బ్రహ్మంగారి ఆలయంలో గ్రామస్థులతో రచ్చబండ కార్యక్రమంలో యువనేత పాల్గొన్నారు. అన్న క్యాంటీన్‌, చంద్రన్న బీమా, విదేశీ విద్య లాంటి అనేక సంక్షేమ పథకాలను టిడిపి అమలు చేసింది. జగన్‌ పాలనలో ప్రజలు భయంతో జీవిస్తున్నారు. భయం పోవాలనే ఉద్దేశంతోనే యువగళం పాదయాత్ర మొదలు పెట్టాను. ప్రతి ఏడాది నోటిఫికేషన్‌ విడుదల చేస్తాం. పెండిరగ్‌ పోస్టులు అన్నీ భర్తీ చేస్తాం. సక్సెస్‌కి షార్ట్‌ కట్‌ లేదు యువత కష్టపడితేనే జీవితంలో విజయం సాధిస్తారు. జగన్‌ పాలనలో రైతులు అప్పులుపాలై ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కేజీ నుంచి పీజీ వరకు విద్యను ప్రక్షాళన చేస్తాం. చదువు పూర్తయిన వెంటనే ఉద్యోగాలు వచ్చేలా విద్యార్థులను సిద్ధం చేస్తామని లోకేశ్‌ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అనేక సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించారని.. ఏపీకి 40వేల పరిశ్రమలు తెచ్చి, ఆరు లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని అన్నారు. జగన్‌ కరెంట్‌ ఛార్జీలు 9 సార్లు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచారన్నారు. నిత్యవసారాలు, పెట్రోలు, గ్యాస్‌ ధరలు సెంచిరీలు దాటుతున్నాయని ఆయన విమర్శించారు. నా 153 రోజుల పాదయాత్రలో అందరూ జగన్‌ ప్రభుత్వ బాధితులేనని తెలుసుకున్నా. నేను అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని నమ్ముకున్నా. పాదయాత్రలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నా… మైకు, స్టూలు లాక్కొన్నారు… ప్రజలు భయపడి మాట్లాడటం లేదు. ఆ భయం పోవాలని విూ మధ్యకి వచ్చా. మనమంతా బటన్‌ జనరేషన్‌గా మారిపోతున్నాం. పైకి రావాలంటే కష్టపడాలి. మనం నమ్ముకున్న దానికి పాటుపడాలని చెప్పుకొచ్చారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు పంట పెట్టుబడులు ఇప్పుడు రెట్టింపు అయ్యాయన్నారు. మంత్రి కాకాణికి కల్తీ మద్యంపై ఉన్న అవగాహన వ్యవసాయం విూద లేదని… ఆయనో కోర్టు దొంగ అంటూ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఏపీ.. రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 3వ స్థానంలో ఉందన్నారు. అన్ని రంగాలని సమానంగా ముందుకు తీసుకువెళుతామని లోకేశ్‌ పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు