- సౌత్ ఇండియన్ బ్యాంక్ ఒప్పందం..
హైదరాబాద్: మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఆటోమొబైల్ డివిజన్) డీలర్లకు ఫైనాన్సింగ్ సొల్యూషన్స్ అందించేందుకు సౌత్ ఇండియన్ బ్యాంక్ (ఎస్ ఐబీ) అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. ఈ భాగస్వామ్యం కింద, సౌత్ ఇండియన్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎం అండ్ ఎం) డీలర్లకు సాటిలేని డీలర్ ఫైనాన్స్ పరిష్కారాలను అందిస్తారు. సౌత్ ఇండియన్ బ్యాంక్ సీనియర్ జనరల్ మేనేజర్, గ్రూప్ బిజినెస్ హెడ్ బిజి ఎస్.ఎస్. మా కస్టమర్ సెంట్రిక్ స్ట్రాటజీకి అనుగుణంగా ఈఎంవోయూపై సంతకాలు చేస్తున్నాం. ఈ కూటమి డీలర్ ఫైనాన్స్ వ్యాపారంపై మా దృష్టిని కేంద్రీకరిస్తుంది. మా డైవర్సిఫైడ్ ఫైనాన్స్ సొల్యూషన్స్ ద్వారా తమ డీలర్లకు సమ్మిళిత ఫైనాన్స్ ఆప్షన్లను అందించగలమని మేము విశ్వసిస్తున్నాము. మహీంద్రా అండ్ మహీంద్రా ఎస్ పిఒసి వైస్ ప్రెసిడెంట్ శ్రీ రాకేష్ సేన్, సౌత్ ఇండియన్ బ్యాంక్ సీనియర్ జనరల్ మేనేజర్ మరియు గ్రూప్ బిజినెస్ హెడ్ బిజీ ఎస్‌ఎస్‌ల మధ్య ఈ అవగాహన ఒప్పందం జరిగింది.
తప్పక చదవండి
-Advertisement-