Saturday, July 27, 2024

దశాబ్ది ఉత్సవాలలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మహిళా ఉత్పత్తుల ప్రదర్శన..

తప్పక చదవండి
  • ముగింపు సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు..

హైదరాబాద్, 11 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
మహిళలు తలుచుకుంటే అసాధ్యాలు సుసాధ్యం చేస్తారని శిల్పారామంలోని మహిళలచే నిర్వహింపబడిన ఉత్పత్తుల ప్రదర్శన ఉత్పత్తులరుజువు చేసిందని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. ప్రదర్శనలోని వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు 100 స్టాళ్లలో ఏర్పాటుచేసిన ఉత్పత్తులు దేనికి అవే తమ ప్రత్యేకతను ప్రదర్శించాయని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల భాగంగా ఏడు రోజులపాటు నిర్వహింపబడిన మహిళా పారిశ్రామికవేత్తల ఉత్పత్తుల ప్రదర్శన ఆదివారం ముగిసింది. ఈ ప్రదర్శనలో దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు, చిన్న తరహా కుటుంబ పరిశ్రమల ప్రతినిధులు, ఉత్పత్తి చేసిన వివిధ వస్తువులు, వివిధ రంగాలకు చెందిన అంశాలతో కూడిన ప్రదర్శన శిల్పారామం కళావేదికలో ఏడు రోజులపాటు కొనసాగింది. ఈ ప్రదర్శనలో చేతివృత్తులు కలంకారి చిత్రలేఖనము, కొండపల్లి బొమ్మలు, నిర్మల్ కొయ్య బొమ్మలు, పెంబర్తి జ్ఞాపికలు, నకాసి పటాలు, చిత్రలేఖనంతో కూడిన చీరలు, వస్త్రాలు కుట్టు పనులు, ఎంబ్రాయిరీలు, అనేక రాష్ట్రాల నుండి వంచిన ఉత్పత్తుల ప్రదర్శన కొనసాగింది. వేసవి ఎండ తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ వారం రోజుల పాటు ఇక్కడ నిర్వహించబడిన ప్రదర్శన కలకల లాడింది. ఈ సందర్భంగా ముగింపు సభలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ వకుళభరణం కృష్ణమోహన్రావు. వివిధ ప్రక్రియలో అత్యంత ప్రతిభను కనబరిచిన మహిళా పారిశ్రామికవేత్తలకు పురస్కారాలు అందజేశారు పుష్పగుచ్చం అందచేసి, శాలువాలు వేసి ఘనంగా సన్మానించారు. ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమం సావిత్రిబాయి పూలే మహిళా సంఘం అధ్యక్షురాలు బెల్లం మాధవి నిర్వహించారు .తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ఈ ప్రదర్శన దిగ్విజయంగా ఏడు రోజులపాటు కొనసాగింది.. ముగింపు సభలో ముఖ్య అతిథి డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ప్రసంగిస్తూ కాశ్మీర్ నుండి కన్యాకుమారి అన్నట్లుగా అన్ని రాష్ట్రాలకు చెందిన మహిళా పారిశ్రామికవేత్తలు తాము రూపొందించిన వస్తువులను తమ ప్రతిభను హైదరాబాద్ వేదికగా ఇక్కడ ప్రదర్శించడం సంతోషంగా ఉందని అన్నారు.. తెలంగాణ ఏర్పడి పది సంవత్సరాలలో సాధించిన ప్రగతికి స్ఫూర్తివంతంగా ఈ ప్రదర్శన కొనసాగడం సముచితంగా ఉందని అన్నారు.

ఈ సభలో ఆత్మీయ అతిథిగా పాల్గొన్న జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడుతూ.. మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగడం మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అభివృద్ధిలోకి రావడం శుభ పరిణామం అన్నారు.. మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని, తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు