Saturday, July 27, 2024

అక్రమంగా డోనేషన్లు వసూళ్లు చేస్తున్న ఇంజనిరింగ్ కాలేజ్ యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి..

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన ఎన్.టి.ఎస్.యూ. రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్..

హైదరాబాద్, 11 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
నవ తెలంగాణ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వృత్తి విద్యా కోర్సులైన ఇంజనీరింగ్, పార్మాసి కళాశాలలో కన్వీనర్ కోట ద్వారా 70 శాతం సీట్లు, యాజమాన్య కోట ద్వారా కేటగిరీ బీ 30 శాతం అడ్మిషన్లు చేపట్టాలి. ఎంసెట్ పరీక్ష నిర్వహించి కన్వీనర్ కోట ద్వారా, ఎంసెట్ ర్యాంక్ ఆధారంగా ప్రభుత్వమే అడ్మిషన్లు చేపడుతుండగా, బీ కేటగిరీ సీట్లను ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి కళాశాల యాజమాన్యాలు అడ్మిషన్లు చేపట్టవల్సింది ఉండగా.. ధనార్జనే ద్వేయంగా విద్యా వ్యాపారానికి తెరలేపుతున్నారు. గతంలో కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులు, ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలలో ఉన్న లోపాలను ఆసరా చేసుకుని, ప్రభుత్వ నిబంధనలు బేఖాతరు చేస్తూ.. మార్గదర్శకాలను విస్మరిస్తూ.. యాజమాన్య కోటా సీట్లను బహిరంగంగా లక్షల్లో డోనేషన్లు వసూళ్లు చేస్తూ, కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటిస్తున్నట్లు పేపర్ ప్రకటనలు ఇస్తూ తప్పుడు డాక్యుమెంట్లు ప్రభుత్వానికి సమర్పిస్తూ కాసుల కోసం యాజమాన్యాలు విద్యార్థుల జీవితాలతో చేలగాటం ఆడుతున్నాయి. ఎంసెట్ ఫలితాల ఆధారంగా కన్వీనర్ కోటా సీట్ల భర్తీ అనంతరం నోటిఫికేషన్ విడుదల చేసి ప్రతిభ ఆధారంగా కేటాయించాల్సిన బీ కేటగిరీ సీట్లను ఎంసెట్ పరీక్ష నిర్వహించకముందే మార్కెట్ లో లేని పోటీ సృష్టించి రోజుకో రేటుతో విద్య వ్యాపారాన్ని కొనసాగిస్తూ విద్యార్థులను, తల్లి దండ్రులను తీవ్రంగా మోసాగిస్తున్నారు. అక్రమంగా డోనేషన్లు వసూళ్లు చేసిన కాలేజ్ లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఎన్.టి.ఎస్.యూ. రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు గౌడ్ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యలపై, అడ్మిషన్ల పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి నిబంధనలు ఉల్లంఘించిన కాలేజ్ ల గుర్తింపు రద్దు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని.. అదే విధంగా మేనేజ్ మెంట్ల కోట సీట్లకు కూడా అప్లికేషన్ తీసుకొని, జేఈఈ ర్యాంక్ ఫస్ట్ ప్రయార్ట్టీ, ఆ తర్వాత ఎంసెట్, ఇంటర్ మార్కులను పరిగణలోకి తీసుకోవాలి.. కానీ ఇవేవీ మేనేజ్ మెంట్ లు పట్టించుకోవడం లేదు.. నోటిఫికేషన్ టైం లోనూ దరఖాస్తులను స్వీకరించడం లేదు.. తీసుకున్న వాటిని పక్కనే పడేస్తున్నారు.. గతేడాది వీటిపై పిర్యాదు రావడంతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, టీఏఫ్ఆర్సీ స్పందించాయి.. దరఖాస్తులు తీసుకోకపోతే మాకు పంపేయాలని వాటిని కాలేజ్ లకు ఇస్తామని స్పష్టం చేశారు.. సీట్లను ఎలా భర్తీ చేశారనే వివరాలను కౌన్సిల్ కు ఇవ్వాలనే నిబంధన పెట్టారు.. అయినా తప్పుడు వివరాలతో కాలేజీ లు గట్టెక్కుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి.. మేనేజ్ మెంట్ చర్యలతో తాము కోరుకున్న కాలేజ్ లలో సీట్లు పొందలేకపోతున్నామని స్టూడెంట్స్ అందోళన వ్యక్తం చేస్తున్నారు.. నిబంధనలకు విరుద్ధంగా భారీగా వసూళ్లు చేస్తున్న ఇంజరింగ్ కాలేజ్ లపై చర్యలు తీసుకోవాలని బైరు నాగరాజు గౌడ్ డిమాండ్ చేస్తున్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు