Saturday, April 27, 2024

అదుపుతప్పిన అర్బన్ రైజ్ బరితెగింపు..

తప్పక చదవండి
  • అమీన్ పూర్ లో నీటి పారుదల చట్టంలోని నిబంధనలకు తూట్లు పొడిచిన వైనం..
  • ప్రేక్షక పాత్రలో ఇరిగేషన్ అధికారులు..
  • మంత్రి వాటాదారుడు అంటూ అర్బన్ రైజ్ అరాచకం..
  • హెచ్ఎండిఏ నిధులతో భారీ కాలువ నిర్మాణం చేసి అర్బన్ రైజ్ అక్రమాలకు లైన్ క్లియర్ …
  • ఎఫ్టిఎల్ ని ఎమినిటీస్ గా మార్చేసిన దుర్మార్గం..
  • అనుమతి లేకుండా నిర్మించిన నాలా..?
  • నాలా నిర్మానంతో అమీన్ పూర్ లో నీట మునిగిన కాలనీలు…
  • ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు..

అర్బన్ రైస్ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక మంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్రచారం చేసుకుంటూ.. అమీన్ పూర్ లో అర్బన్ రైస్ సరికొత్త పందాను తెర మీదికి తెచ్చింది. హెచ్ఎండిఏ నిధులతో తన నిర్మాణం కోసం నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసి.. కాలువ నిర్మాణం చేసి, కాలనీల ముంపుకు కారణం అయ్యింది. ప్రజల అవసరాలకు ఉపయోగించాల్సిన ప్రభుత్వ సొమ్మును ప్రవేటు నిర్మాణదారులకు కొమ్ముకాస్తూ హెచ్ఎండిఏ అధికారులు ఇరిగేషన్ అనుమతులు లేని కాలువ నిర్మాణం చేపట్టి నీళ్లపాలు చేయడం ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతికి నిదర్శనం.

సంగారెడ్డి జిల్లా, పఠాన్ చెరు నియోజకవర్గం, అమీన్ పూర్ మున్సిపాలిటీలో అర్బన్ రైస్ నిర్మాణ సంస్థ తన నిర్మాణానికి అడ్డొస్తుందని నీటి పరివాహక దిశను మార్చి.. ప్రభుత్వ సొమ్ముతో కాలువ నిర్మాణం చేపట్టడం.. అందుకోసం హెచ్ఎండిఏ అధికారుల సంపూర్ణ సహకారాన్ని అందించి కాలనీలను నీట ముంచేశారు. ఇరిగేషన్ అధికారుల అనుమతులు లేకుండానే నీటి ప్రవాహాన్ని మారుస్తూ ప్రభుత్వం సొమ్ముతో ప్రవేటు నిర్మాణదారులకు లబ్ధి చేకూరుస్తూ హెచ్ఎండిఏ అధికారులు భారీ కాలువను ఏ విధంగా నిర్మిస్తారంటూ ఈ ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అనుమతులు లేకుండా చిన్నపాటి నిర్మాణాలు చేపడితేనే ఆగమేఘాలమీద కూల్చివేతలు చేపట్టే అధికారులకు ప్రజలకు నష్టం చేసే భారీ కాలువ కనబడకపోవడం శోచనీయం. అర్బన్ రైస్ నిర్మాణ సంస్థ చెరువు ఎఫ్ టి ఎల్ ను సైతం కబ్జా చేసి తన నిర్మాణంలోని ఎమినిటీస్ గా చూపిస్తుండడం ఆ సంస్థ బరితెగించి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతుంది అనడానికి నిదర్శనం. వారం రోజులు భారీగా కురిసిన వానలకు అర్బన్ రైస్ చేపట్టిన అక్రమ కాలువ కారణంగా అమీన్ పూర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలు నీట మునిగాయి. టిఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక మంత్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటూ ప్రచారం చేస్తున్న నిర్మాణ సంస్థలో ఆ మంత్రి నిజంగానే వాటాదారుడా? లేదా నిర్మాణ సంస్థ ఆ మంత్రి పేరుని అడ్డుపెట్టుకొని అక్రమాలకు తెరలిపిందా అనేది ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. మంత్రిగారి డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే కాలనీలు నీట మునిగినా, ప్రజల ఆస్తులకు నష్టం జరిగినా, చివరికి ప్రజల ప్రాణాలు పోయినా అధికారులు పట్టించుకోరా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. భారీ ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయల ప్రజల ఆస్తులను కనుమరుగు చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెక్కినట్టు వ్యవహరించడం చూస్తుంటే ప్రభుత్వంలోని పెద్దల కనుసన్నల్లోనే అధికారులు నడుచుకుంటున్నారనేది తేట తెల్లమవుతుంది. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారులు అనుమతి లేకుండా అక్రమంగా నిర్మించిన కాలువను తొలగించి, ఎఫ్ టి ఎల్ ను కబ్జా చేసిన అర్బన్ రైస్ నిర్మాణ సంస్థపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అర్బన్ రైస్ నిర్మాణ సంస్థకి అనుమతులు ఎలా వచ్చాయి? మంత్రి పేరు అడ్డుపెట్టుకొని చేస్తున్న అక్రమ దందాపై ఆదాబ్ హైదరాబాద్ ఆధారలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తేనుంది….’మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘…

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు