హైదరాబాద్ డీఆర్‌డీవోలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం కాంప్లెక్స్‌కు కొత్తగా రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్‌సీఐ), అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ల్యాబోరేటరీ (ఏఎస్‌ఎల్) విభాగాలకు కొత్తగా ఇద్దరు డైరెక్టర్లు నియమితులయ్యారు. ఆర్‌సీఐ విభాగానికి ప్రముఖ శాస్త్రవేత్త అనింద్య బిశ్వాస్ ఎంపిక కాగా, ఏఎస్‌ఎల్ విభాగ డైరెక్టర్‌గా విశిష్ట శాస్త్రవేత్త బీవీ పాపారావు ఎంపికయ్యారు. వీరిద్దరు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఆర్‌సీఐ అనేది డీఆర్డీవోకు చెందిన ప్రీమియర్ ఏవియానిక్స్ ల్యాబ్.