- వర్షాల కారణంగా జీహెచ్ఎంసీ పరిథిలోని అన్ని రకాల విద్యాసంస్థలు
సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు..
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా జీహెచ్ఎంసీ పరిథిలోని అన్ని రకాల విద్యా సంస్థలలతో సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నేడు, రేపు రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.. అయితే వైద్యం, పాల సరఫరా తదితర అత్యవసర సేవలు కొనసాగుతాయని పేర్కొన్నారు.. ప్రయివేట్ సంస్థలు కూడా వారి వారి కార్యాలయాలకు సెలువులు ప్రకటించేలా చర్యలు చేపట్టాలని కార్మిక శాఖను సిఎం కేసీఆర్ ఆదేశించారు..