Thursday, May 2, 2024

వింజపల్లిలో టీఎస్ ఆర్టీసీ అవగాహన కార్యక్రమం..

తప్పక చదవండి

సిద్దిపేట జిల్లా, కోహెడ మండలం, వింజపల్లి గ్రామంలో సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి సంబంధించిన విషయాలపైన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇట్టి అవగాహన సదస్సులో సర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, హుస్నాబాద్ ఆర్.టి.సి. బస్ డిపో మేనేజర్ మాట్లాడుతూ ముఖ్యంగా టి.ఎస్.ఆర్.టి.సి.కి సంబంధించి కొత్తగా అమలుచేసిన “విలేజ్ బస్ ఆఫీసర్” కి సంబంధించిన విషయాలపై చర్చలు చేయడం జరిగింది. వింజపల్లి గ్రామ విలేజ్ బస్ ఆఫీసర్ గా చంద్రమౌళిని నియమించడం జరిగింది. అలాగే టీఎస్ ఆర్టీసీ సంస్థ వారు ప్రతి గ్రామానికి సురక్షిత రవాణా సౌకర్యం అందిస్తున్నారని ప్రతి ఒక్కరూ ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఆర్టీసీకి సంబంధించిన వికలాంగులకు బస్ పాసులు, విద్యార్థులకు ఉచిత బస్ పాసులు, వివాహాది శుభకార్యాలకు, విహార యాత్రలకు అద్దె బస్సులు సమకూర్చడంలో కొత్తగా నియమించే ఈ “విలేజ్ బస్ ఆఫీసర్” సహాయంగా ప్రజలకు అందుబాటులో ఉంటాడు అని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఆర్టీసీ అందించే సదుపాయాలను వినియోగించుకొని సంస్థను కాపాడాలని కోరారు.. ఇట్టి కార్యక్రమంలో ఉపసర్పంచ్ అక్కరవేని సాహితీ-రాజు, మాజీ సర్పంచ్ ఇప్పలపల్లి పుష్పాలత-ఆనంతరాములు, మాజీ ఉపసర్పంచ్ బద్దం తిరుపతి రెడ్డి, ఇప్పలపల్లి కృష్ణమూర్తి, గుర్రాల రాజేశ్వర్ రెడ్డి, అన్నాడి లక్ష్మారెడ్డి, పెద్ది రాజమౌళి, గర్రెపల్లి పర్శరాములు, ఆర్.టి.సి. సిబ్బంది, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు