Tuesday, June 18, 2024

టీజర్‌లో త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ మార్క్‌..

తప్పక చదవండి

పవన్‌ కల్యాణ్‌ తాజా చిత్రం బ్రో. వినోధయ్ సీతమ్‌ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా మేకర్స్ విడుదల చేసిన బ్రో టీజర్‌ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. అయితే ఓ విషయంలో మాత్రం అభిమానలు నిరాశకు లోనవుతున్నారన్న వార్త ఫిలింనగర్ సర్కిల్‌లో హల్‌ చల్ చేస్తోంది. భీమ్లా నాయక్‌కు సంభాషణలు అందించిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఈ చిత్రానికి కూడా డైలాగ్స్ రాశారని తెలిసిందే. ఏ సినిమాలోనైనా తన మార్క్‌ చూపించే త్రివిక్రమ్‌ మేనియా బ్రోలో మాత్రం మిస్సయినట్టు టీజర్‌తో అర్థమవుతోంది. ఈ కారణం వల్లే మూవీ లవర్స్‌ నిరాశలో ఉన్నట్టు ఇన్‌సైడ్‌ టాక్‌. టీజర్‌లో ఒకటి, రెండు డైలాగ్స్ మినహా పెద్దగా చెప్పుకునేంత సంభాషణలు లేకపోవడం త్రివిక్రమ్‌ ఫ్లేవర్‌ లేనట్టు స్పష్టమవుతోంది. మరి ట్రైలర్‌లోనైనా అభిమానులను ఇంప్రెస్‌ చేసే డైలాగ్స్ ఏమైనా ఉండబోతున్నాయా..? అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.

ఇప్పటికే బ్రో మూవీ పోస్టర్లు నెట్టింట హల్‌ చల్‌ చేస్తూ.. ట్రెండింగ్ అవుతున్నాయి. టైమ్‌ లైన్‌ విజువల్స్‌తో బ్రో టీజర్‌ షురూ అవగా.. ఏంటిది ఇంత చీకటిగా ఉంది.. ఏవండి ఎవరూ లేరా అని అడుగుతున్నాడు చీకట్లో ఉన్న సాయిధరమ్‌ తేజ్‌. హలో మాస్టారు.. గురువుగారు.. హలో తమ్ముడు.. బ్రో అనే డైలాగ్స్‌ బ్యాక్‌డ్రాప్‌లో వస్తుండగా.. పవన్‌ కల్యాణ్ స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు. చివరలో సినిమాలు ఎక్కువగా చూస్తావేంట్రా నువ్వు అని సాయిధరమ్‌ తేజ్‌ను అడుగుతున్నాడు పవన్‌ కల్యాణ్‌.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు