Thursday, October 10, 2024
spot_img

విదేశాల్లో శిక్షణ కోసం భారత స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా..

తప్పక చదవండి

రానున్న ప్రతిష్ఠాత్మక టోర్నీలను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ శిక్షణ కోసం భారత స్టార్‌ రెజ్లర్లు వినేశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పునియా విదేశాలకు వెళ్లేందుకు అనుమతి లభించింది. టార్గెట్‌ ఒలింపిక్‌ పోడియం స్కీమ్‌ కింద వినేశ్‌, బజరంగ్‌కు కేంద్ర క్రీడాశాఖ అనుమతించింది.. అధికారులు ఈ విషయాన్ని ధృవీకరించారు.. 36 రోజుల శిక్షణ కోసం బజరంగ్‌ పునియా.. కిర్గిస్థాన్‌ వెళ్లనుండగా, వినేశ్‌.. కిర్గిస్థాన్‌తో పాటు హంగరీకి పయనం కానుంది. వీరితో పాటు సహచర రెజ్లర్లు సంగీతా ఫోగట్‌, జితేందర్‌, సహాయక బృందం అశ్విని జీవన్‌పాటిల్‌, సుదేశ్‌, సుజిత్‌మాన్‌, అనూజ్‌ గుప్తా, జితేందర్‌, ఖాజీ హసన్‌ బయల్దేరి వెళ్లనున్నారు. వీరికి సంబంధించిన విమాణ ప్రయాణం, వసతి రవాణా ఖర్చులను ఒలింపిక్‌ గోల్డ్‌ క్వెస్ట్‌(వోజీక్యూ) భరించనుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు