Friday, May 3, 2024

ప్రేక్షకులను మంత్ర ముగ్థులను చేసి ఆలరింప జేసిన శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకం.

తప్పక చదవండి

గరిడేపల్లి మండలం గానుగబండ గ్రామం లో శ్రీ శ్రీనివాస నాట్య కళామండలి వారు శనివారం రోజు రాత్రి 8-30 నుండి తెల్లవారుజామున (ఆదివారం ) 3 గంటల వరకు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాటకాన్ని సినీ సెట్టింగులతో ప్రదర్శించారు. బ్రహ్మం గారిగా, సిద్దయ్య లు గా ప్రతిష్టత్మాకమైన రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు గ్రహీతలు గోధుమల మల్లయ్య చారీ, గోధుమల ఈశ్వరాచారీ లు నటించి ప్రేక్షకులను ఆలరింపజేశారు. వీరిద్దరూ తండ్రి కొడుకు కావటం విశేషం. టీవీ లు సినిమాల మోజులో పడి పౌరాణిక నాటకాలను సరిగా ఆదరించని ఈ రోజులలో కూడా గరిడేపల్లి మండలం లోని అన్ని గ్రామాల తో పాటు, సరిహద్దు మండలాలు అయిన హుజుర్నగర్, మట్టంపల్లి మండలాలోని అనేక గ్రామాలనుండి వేలాది మంది తిలకించటానికి రావటం గమనార్హం. సుమారుగా ఆరు గంటల పాటు ఎక బిగిగా ప్రదర్శించిన ఈ నాటకాన్ని ప్రజలు కదలకుండా చూడటమంటే, కళాకారులు ఎంత గొప్పగా నటించారో మనకు ఇట్టే అర్ధం అవుతోంది. ఈ నాటకానికి వ్యాఖ్యతగా జిల్లా రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ వ్యవహరించగా, దర్శకత్వం గోధుముల మల్లాచారీ వహించగా, సంగీతం బొడ్డుపల్లి రంగారావు, నారదునిగా షేక్ నబిసాహెబ్, భూదేవి గా గుర్రం జయమ్మ, కక్కడు గా జానపటి సైదులు, పటేల్ గా పోకల ఆంజనేయులు, ఈశ్వరమ్మ పాత్రలో గోధుమల ఈశ్వరమ్మ,తదితరులు నటించి ప్రేక్షకులను అలరింపజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు