Saturday, July 27, 2024

భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు..

తప్పక చదవండి
  • వివరాలు అందించిన దక్షిణ మధ్య రైల్వే..

భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పలు రైళ్లు రద్దయ్యాయి. హసన్‌పర్తి – కాజీపేట మార్గంలో రైల్వేట్రాక్‌పై భారీగా వర్షం నీరు నిలిచింది. దాంతో అధికారులు పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్నింటిని రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ – సికింద్రాబాద్ (17012), సికింద్రాబాద్ – సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ (17233), సిర్పూర్‌ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (17234) రైళ్లను రద్దు చేసినట్లు పేర్కొంది. తిరుపతి – కరీంనగర్ (12761), కరీంనగర్ – తిరుపతి (12762), సికింద్రాబాద్ – సిర్పూర్‌ కాగజ్ నగర్ (12757), సిర్పూర్‌ కాగజ్ నగర్ – సికింద్రాబాద్ (12758) రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది. అలాగే సికింద్రాబాద్‌ – బీదర్‌ (17010), బీదర్‌ – సికింద్రాబాద్‌ (17009) రైళ్లను క్యాన్సిల్‌ చేసినట్లు తెలిపింది. కన్యాకుమారి – హజ్రత్‌నిజాముద్దీన్‌ (12641), మధురై -చండీగఢ్‌ (12687), దానాపూర్‌ – ఎస్‌ఎంవీటీ బెంగళూరు (12296), హజ్రత్‌నిజాముద్దీన్‌ – హైదరాబాద్‌ (12722), ఓకా – పూరి (20820), దానాపూర్‌ – బెంగళూరు (03245), దానాపూర్‌ – కేఎస్‌ఆర్‌ బెంగళూరు (06510), కోర్బా – యశ్వంత్‌పూర్‌ (12252), దర్బంగా – మైసూర్‌ (12577), గోరఖ్‌పూర్‌ – సికింద్రాబాద్‌ (12589), హజ్రత్‌ నిజాముద్దీన్‌ – చెన్నై సెంట్రల్‌ (12434), అయోధ్య క్యాంట్‌ – రామేశ్వరం (22614), హజ్రత్‌ నిజాముద్దీన్‌ – మధురై (12652), చాప్రా – చెన్నై సెంట్రల్‌ (12670), హజ్రత్‌ నిజాముద్దీన్‌ – యశ్వంత్‌పూర్‌ (12650), గోరఖ్‌పూర్ – కొచ్వెలి (12511) రైళ్లను మళ్లించింది.

అలాగే, చెన్నై సెంట్రల్‌ – న్యూఢిల్లీ (12615), సికింద్రాబాద్‌ -గోరఖ్‌పూర్‌ (12590) రైళ్లను రీషెడ్యూల్‌ చేసినట్లు తెలిపింది. వీటితో పాటు కోర్బా – కొచ్వెలి (22647), న్యూఢిల్లీ – హైదరాబాద్‌ (12724), హజ్రత్‌ నిజాముద్దీన్‌ – బెంగళూరు (20806), నిజాముద్దీన్‌ – విశాఖపట్నం (20806), దానాపూర్‌ – సికింద్రాబాద్‌ (12792), అహ్మదాబాద్‌ – చెన్నై సెంట్రల్‌ (12655), వైష్ణోదేవి కత్రా – చెన్నై (16032), న్యూఢిల్లీ – తిరువనంతపురం (12626), న్యూఢిల్లీ – ఎంజీఆర్‌ చెన్నై సెంట్రల్‌ (12622), జైపూర్‌ – మైసూర్‌ (12979), భగత్‌కి కోఠి – తిరుచిరాపల్లి (12616), ఓకా – పురి (20820) రైళ్లను మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు