Saturday, July 27, 2024

నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద వేడుకగా ఛత్రస్థాపనోత్సవం..

తప్పక చదవండి

తిరుమల నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ఆదివారం ఛత్రస్థాపనోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. శ్రీవారి పాదాల వద్ద టీటీడీ అర్చక బృందం ప్రత్యేకంగా అలంకరించిన గొడుగును ప్రతిష్టించారు. శ్రీవారి ఆలయం నుంచి పూజా సామ‌గ్రి, పుష్పాలు, నైవేద్యం, గొడుగుతో మంగళవాయిద్యాల నడుమ ఆల‌య మాడ వీధుల గుండా అర్చక బృందం మేదరమిట్టకు చేరుకున్నారు. అక్కడి నుంచి నారాయ‌ణ‌గిరికి చేరుకుని శ్రీ‌వారి పాదాల‌కు తిరుమంజ‌నం చేప‌ట్టారు. పాలు, పెరుగు, తేనె, చందనంతో అభిషేకం, నైవేద్యం సమర్పించారు. వేదపారాయణదారులు ప్రబంధ శాత్తుమొర నిర్వహించారు. తిరుమల ఏడుకొండల్లో అత్యంత ఎత్తయిన నారాయణగిరి శిఖరంపై కలియుగంలో శ్రీవేంకటేశ్వరస్వామి మొదటగా కాలు మోపినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందని అర్చకులు పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ద్వాదశి నాడు ఛత్రస్థాపనోత్సవం నిర్వహిండం ఆనవాయితీగా వస్తుందన్నారు.

నారాయణగిరి శిఖరం ఎక్కువ ఎత్తులో ఉండడం ఈ కాలంలో మరింత ఎక్కువగా గాలులు వీయడం, ఈ గాలుల నుంచి ఉపశమనం కల్పించాలని వాయుదేవుని ప్రార్థిస్తూ ఇక్కడ గొడుగును ప్రతిష్టించారు. కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుల్లో ఒకరు ఎటి.గోవిందరాజ దీక్షితులు, అర్చకులు ఎ.గోవిందాచార్యులు, ఏఎస్.కృష్ణచంద్ర దీక్షితులు, పార్‌ప‌త్తేదార్ ఉమామ‌హేశ్వర్ రెడ్డి త‌దిత‌రులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు