Friday, May 10, 2024

అంటార్కిటికాలో అర్జెంటినా సైజున్న మంచుఫలకం మాయం..!

తప్పక చదవండి

గ్లోబల్‌ వార్మింగ్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ఇబ్బందులుపడుతున్నాయి. ఎక్కడో ఒక చోట కనీవినీ ఎరుగని రీతిలో వరదలు.. మరికొన్ని చోట్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే షాకింగ్‌ రిపోర్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో మంచు ఫలకలు కరుగుతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వాస్తవానికి ప్రతి సంవత్సరం వేసవిలో అంటార్కిటికాలోని మంచు ఫిబ్రవరి చివరిలో కరుగుతుంది. శీతాకాలంలో తిరిగి గడ్డకడుతుంది. కానీ, ఈ సంవత్సరం శాస్త్రవేత్తలు అక్కడ పరిస్థితులు భిన్నంగా ఉన్నట్లు గుర్తించారు. అలాగే మంచు ఆశించిన స్థాయిలో లేదని నివేదిక పేర్కొంటున్నది. గత 45 ఏళ్లలో ఇక్కడ చాలా మార్పు వచ్చిందని, ఇంత తక్కువ స్థాయిలో మంచు ఉండడం ఇదే తొలిసారి. నేషనల్ స్నో అండ్ ఐస్ డేటా సెంటర్ డేటా ప్రకారం.. 2022లో మంచు 16లక్షల చదరపు కిలోమీటర్లు ఉన్నది. గత శీతాకాలం కంటే తక్కువగా ఉంది. వాతావరణ సంక్షోభం అంటార్కిటికాను మరింత తీవ్రంగా ప్రభావితం చేసే సూచనలు ఉన్నాయని, దీనికంతటికి గ్లోబల్‌ వార్మింగ్‌ పెద్ద కారణమని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. అంటార్కిటికాలో సముద్రపు మంచు 1981 నుంచి 2010 సగటు కంటే 26లక్షల చదరపు కిలోమీటర్లు తక్కువగా ఉంది.

దీని విస్తీర్ణం అర్జెంటీనా, టెక్సాస్, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, అరిజోనా, నెవాడా, ఉటా, కొలరాడో దేశాల విస్తీర్ణంతో సమానంగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ ఘటన అసాధారణమని పలువురు శాస్త్రవేత్తలు అభివర్ణించారు. లక్షల ఏళ్ల తరవత ఇలాంటి ఘటన కనిపిస్తోందని చెప్పారు. కొలరాడో బౌల్డర్‌ విశ్వవిద్యాలయంలోని గ్లేషియాలజిస్ట్‌ టెడ్‌ స్కాంబోస్‌ మాట్లాడుతూ ఇది సాధారణ దృగ్విషయం కాదన్నారు. వాతావరణం నిరంతరంగా మారుతుందని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా మారుతోందని పేర్కొన్నారు. అయితే, సముద్రపు మంచు కరగడానికి కారణాలను తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. అయితే, అంటార్కిటికాలో సముద్రపు మంచు గత కొన్ని దశాబ్దాలుగా రికార్డు స్థాయి నుంచి కనిష్టానికి పడిపోతుండగా.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు శాస్త్రవేత్తలను కలవరానికి గురి చేస్తున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు