- ఏర్పాట్లు పూర్తిచేసిన ఏపీ అటవీశాఖ..
నల్లమల పులుల కారిడార్‌ను శేషాచలానికి తరలించేందుకు ఏపీ అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. బద్వేలు మీదుగా పెద్ద పులులు శేషాచలం అడవిలో తిరిగేలా చర్యలు తీసుకోనున్నది. ప్రస్తుతం నల్లమల అటవీప్రాంతంలో పెద్ద పులుల సంచారం ఎక్కువ ఉండటంతో వాటిని శేషాచలం కొండల వైపు మళ్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు పీసీసీఎఫ్ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. శేషాచల కొండలు పెద్ద పులుల సంచారానికి అనువుగా ఉన్నాయని గుర్తించి, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అదే సమయంలో తిరుమల నడకమార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ఈ మార్గంలో చిరుతలు పలువురు భక్తులను గాయపర్చినా, మనుషులకు ప్రాణపాయం లేకుండా ఉన్నాయి. కానీ, పెద్ద పులులు అలా కాదు.. పెద్ద పులులు అటవీ ప్రాంతాన్ని దాటి వస్తే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.
తప్పక చదవండి
-Advertisement-