Monday, May 6, 2024

దశాబ్ది ఉత్సవాలు అంటూ.. రైతులకు బేడీలు వేయడం ఈ ప్రభుత్వానికే చెల్లింది

తప్పక చదవండి
  • టీటీడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన

హైదరాబాద్ : మార్కెట్ యార్డులలో రైతులు తరలించిన పంటలను రక్షించలేని పరిస్థితి నేడు రాష్ట్రంలో నేలకొన్నదని టీటీడిపి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఆరోపించారు. .. దశాబ్ది ఉత్సవాలు అంటూ రైతులకు బేడీలు వేయడం ఈ ప్రభుత్వానికే చెల్లిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.గురువారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ దశాబ్ది ఉత్సవాల కోసం బి ఆర్ ఎస్ నాయకులు చేస్తున్న ఖర్చుతో రైతులకు ఎంతగానో లబ్ది చేకూర్చవచ్చని ఆవేదన వ్యక్తం చేశారు.దుబారా ఖర్చు రాష్ట్రానికి ఇప్పుడు అవసరమా అని ఆమె ప్రశ్నించారు. ? మిగులు రాష్ట్రాన్నికెసిఆర్ అప్పుల రాష్ట్రంగా తయారు చేశారని విమర్శించారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చినందు వల్ల రైతులు నష్టపోతున్నామని ఆందోళన చేస్తే వారికి బేడీలు వేసి తీసుకెళ్లారని అన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం అమానుషంగా ప్రవర్తించడం ఇదేమి కొత్త కాదని పేర్కొన్న కాట్రగడ్డ ప్రసూన రాష్ట్రంలో మూడు సందర్భాల లో రైతులను అరెస్టు చేసిన సందర్భాలున్నాయని చెప్పుకొచ్చారు. రైతులకు బేడీలు వేయడం ఇది పురోగతా.అని ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. .? నిమ్స్ ఆస్పత్రికి ముఖ్యమంత్రి గురువారం శంకుస్థాపన చేశారు. కానీ పేదోళ్ల దవాఖాన అయిన ఉస్మానియా ఆస్పత్రికి దిక్కు లేకుండా పోయిందని విమర్శించారు.

డాక్టర్ ఏ.ఎస్.రావు మాట్లాడుతూ.. రక్షణ కవచంగా, ఫ్రంట్లైన్ వారియర్స్ గా ఉండి ప్రభుత్వానికి.. ముఖ్యమంత్రికి పనిచేస్తున్న హెూంగార్డులను కేసీఆర్ విస్మరించారని అన్నారు. ఉద్యమ సమయంలో, అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక వేదికలపై కేసీఆర్ హెూంగార్డులకు ఇచ్చిన హామీలను విస్మరించారని పేర్కొన్నారు. . 2008లో తెలంగాణ ఉద్యమ పోరాటం లో హెూంగార్డులను కానిస్టేబుళ్లుగా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారని ప్రభుత్వం ఏర్పడ్డాక హామీని మరిచారని అన్నారు. జూన్ 22, 2014 న సూపర్కాప్ మీటింగ్.. 2017 మార్చి 27వ తేదిన సాక్షాత్తు శాసనసభలో హెూంగార్డులను రెగ్యులర్ ఉద్యోగులుగా చేస్తామని.. 2017 మే 19న హైటెక్స్ లో.. జరిగిన పోలీస్ ఆఫీసర్స్ మీటింగ్ హెూంగార్డులకు రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చి స్కేల్ ఎంప్లాయిస్ చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని వివరించారు.వీరికి ఇచ్చిన హామీని కేసీఆర్
నెరవేర్చలేదని ఆరోపించారు . హెూంగార్డులకు ఆరోగ్యభద్రత కూడా లేదు.హెూంగార్డుల అసోసియేషన్ కు గౌరవాధ్యక్షునిగా అబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.హెూంగార్డుల సమస్యలను ముఖ్యమంత్రికి చెప్పే దమ్ము శ్రీనివాస్ గౌడ్ కు లేదు అన్నారు. దళితులకు కేసీఆర్ ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా వారిని మోసం చేస్తూనే ఉన్నారని అన్నారు. అలాగే ఎన్నికలకు ముందు బీసీలకు రూ. లక్ష లోన్అని చెప్పి ఎన్నికలవేళ బీసీలనూ మోసం చేయాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రిపై మానవ హక్కుల సంఘానికి నాలుగుసార్లు ఫిర్యాదు చేయడం జరిగిందని పేర్కొన్న ఆయన . రాష్ట్ర ప్రభుత్వం సంవత్సర కాలం నుంచి మానవ హక్కుల కమిషన్ ను నియమించడం లేదని అన్నారు . రాష్ట్ర ప్రభుత్వం మానవహక్కుల సంఘం కమిషన్ ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు . హెూంగార్డులకు కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి మాట్లాడుతూ.. 1200 మంది ఆత్మబలిదానాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నా ప్రయోజనం లేకుండా పోయిందని తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి ఆరోపించారు. రాష్ట్రం బంగారు తెలంగాణగా మారుతుందని ప్రజలు భావించిన బొందల తెలంగాణగా మారుతుండటం చూసి ప్రజలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని అన్నారు. . రాష్ట్రంలో 6 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వయస్సు వరకు ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు . మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను నియంత్రించడంలో ప్రభుత్వా నికి చిత్త శుద్ధి లేదని విమర్శించారు .రాష్ట్ర హెూంశాఖ మంత్రి నిద్రపోతున్నారని తెలుగు మహిళ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఆరోపించారు. స్థానిక అధికార ఎమ్మెల్యే మనుషులు తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని శేజల్ అనే మహిళ రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని సీబీఐ చేత విచారణ జరిపించాలని అడుగుతున్నారని .దేన్నీ బట్టి చూస్తే అర్ధం చేసుకోవచ్చని రాష్ట్రములో శాంతి భద్రతల ఏ స్థాయికి దిగజారాయోనని అన్నారు . ముఖ్యమంత్రి ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై నిపుణులైన మహిళా నాయకురాళ్ళతో ముఖ్యమంత్రి చర్చించాలని సూచించారు .మహిళలపై అఘాయిత్యాలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ సాయి తులసి,తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు