Friday, May 3, 2024

తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకు నిరసన చేసే హక్కులేదా..?

తప్పక చదవండి
  • అధికారంలో ఉన్నవారు ఆందోళన చేస్తే అమలుకాని ట్రాఫిక్ ఆంక్షలు..
  • సామాన్యులు ఆందోళన చేస్తే ఎందుకు అమలవుతున్నాయి..?
  • ఇద్దరు సీఎంలు అధికారంలో ఎప్పుడూ ఉంటామని భ్రమ పడుతున్నారా ?
  • తెలుగుదేశం జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ వెల్లడి..
  • బాబు అరెస్ట్ కు చట్టబద్దత లేదు, అరెస్టుని ఖండించిన ఐటీ ఉద్యోగులు

హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సామాన్యులకు నిరసన చేసే హక్కులేదా..? నిజంగా మన దేశంలో రాజ్యాంగం అమలవుతుందా..? అని తెలుగుదేశం జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ గత 3 రోజులుగా హైదరాబాద్‌లోని ఐటీ ప్రాంతాలైన మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్ రాం గూడ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వారికి తెలుగుదేశం జాతీయ కార్యదర్శి కాసాని వీరేష్ ముదిరాజ్ సంఘీభావం తెలియజేశారు. శాంతి యుతంగా ఆందోళన చేస్తున్న ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వాలకు తగదని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నవారు ఆందోళన చేస్తే అమలుకాని ట్రాఫిక్ ఆంక్షలు..సామాన్యులు ఆందోళన చేస్తే ఎందుకు అమలవుతున్నాయని వీరేష్ ప్రశ్నించారు.? ఇద్దరు సీఎంలు అధికారంలో ఎప్పుడూ ఉంటామని భ్రమ పడుతున్నారని.. వారి భ్రమలు తొలగే రోజులు దగ్గరపడ్డాయని వీరేష్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో టీడీపీకి వస్తున్న జనాదరణను చూసి ఓర్వలేక పనిగట్టుకుని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆడుతున్న ఆటగా ఆయన అభివర్ణించారు. కేవలం ఓటమి భయంతోనే బాబును అక్రమంగా అరెస్ట్ చేశారని పేర్కొన్న వీరేష్, బాబు అరెస్టుకు చట్టబద్దత లేదని.. బేషరతుగా బాబును విడుదల చేయాలని డిమాండ్ చేశారు.. బాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఉద్యోగులు, యువత చేపడుతున్న ఆందోళనకు ఆయన సంఘీభావం తెలిపారు.

హైదరాబాద్ లో ఆందోళన బాట పట్టిన టెకీలు :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ గత 3 రోజులుగా హైదరాబాద్‌లోని ఐటీ ప్రాంతాలైన మాదాపూర్, గచ్చిబౌలి, మణికొండ, నానక్ రాం గూడ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగులు ఆందోళన చేపట్టారు.ఈ నేపథ్యంలో శుక్రవారం పలు ప్రాంతాల్లో టెకీలు ఆందోళనలకు పిలుపునిచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఐటీ ఉద్యోగుల ఆందోళనలకు ఎలాంటి అనుమతి లేదని తేల్చిచెప్పారు. మాదాపూర్‌, గచ్చిబౌలి, మణికొండ, నానక్‌రాంగూడ ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా ధర్నాలు నిర్వహించి.. సామాన్య ప్రజలకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు వల్లనే ఐటీ అభివృద్ధి చెందిందని, ఆయన అరెస్టు పట్ల టెకీలు ఆందోళన వ్యక్తం చేస్తూ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద టెకీలు, యువత నల్ల రిబ్బన్లతో నిరసనకు దిగారు. ఉమ్మడి ఏపీ సీఎంగా చంద్రబాబు హయాంలో ఐటీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని గుర్తు చేశారు. జై చంద్రబాబు అంటూ టెకీలు నినాదాలు చేశారు.

- Advertisement -

హైదరాబాద్ అభివృద్ధిలో బాబు పాత్ర కీలకం :
చంద్రబాబు అరెస్ట్ అక్రమం, అన్యాయమని టెకీలు అన్నారు. చంద్రబాబు కోసం కాదు ఏపీ అభివృద్ధి కోసం ప్రజలందరూ కలిసికట్టుగా బయటకు రావాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు . హైదరాబాద్ అభివృద్ధిలో బాబు పాత్ర కీలకమని టెకీలు గుర్తుచేశారు. స్కిల్ డెవలప్మెంట్ లో ఎలాంటి అక్రమాలు జరగలేదన్నారు. కావాలనే కుట్రపూరిత ఆలోచనతో బాబును జైలుకు పంపారని ఆరోపించారు. తాను అవినీతి పరుడు అయితే మిగతా వాళ్లు కూడా అలాగే ఉంటారని జగన్ భ్రమిస్తున్నారని స్పష్టం చేశారు.

నిరసనతో విప్రో సర్కిల్ వద్ద ట్రాఫిక్ జామ్ :
స్కిల్ డెవలప్ మెంట్ లో అవినీతి అని ఆరోపించి చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ సానుభూతిపరులు మండిపడుతున్నారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా విప్రో సర్కిల్ వద్దకి వచ్చి టెకీలతో కలిసి నల్ల రిబ్బన్లు ధరించి నిరసనలో పాల్గొన్నారు. విజన్, డెవలప్ మెంట్ అంటే గుర్తుకొచ్చే వ్యక్తి చంద్రబాబు అని అలాంటి నేతను అక్రమంగా అరెస్ట్ చేసి వేధింపులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెకీల, టీడీపీ మద్దతుదారుల నిరసనతో విప్రో సర్కిల్ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది.

కూకట్ పల్లిలో ర్యాలీ :
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో, కుత్బుల్లాపూర్ లో టీటీడీపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కేపీహెచ్‌బీకాలనీలోని గాంధీ విగ్రహం వద్ద భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. 600 మందికిపైగా చంద్రబాబు అభిమానులు రహదారిపైకి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రెండు గంటల పాటు జాతీయరహదారిపై నినాదాలు చేశారు. ‘సైకో పోవాలి.. సైకిల్‌ రావాలి’ అని ప్లకార్డులు ప్రదర్శించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని ఏపీ పరిరక్షణ సమితి సభ్యుడు కొలికపూడి శ్రీనివాస్‌ హెచ్చరించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు