Friday, April 19, 2024

విచారణకు స్వీకరించం

తప్పక చదవండి
  • పార్లమెంటు ప్రారంభోత్సవ పిల్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
  • ఇలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తున్నారో తమకు తెలుసని వ్యాఖ్య
  • ఎలాంటి జరిమానా విధించనందుకు సంతోషించాలని హెచ్చరిక
  • పిల్ ను విత్ డ్రా చేసుకుంటానన్న అడ్వకేట్

న్యూఢిల్లీ : కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం అంశంపై సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ శుక్రవారం తిరస్కరించబడింది. పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ను భారత రాష్ట్రపతి చేత ప్రారంభింపజేయాలని.. దీనిపై లోక్ సభ సెక్రటేరియట్ కు, కేంద్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. అయితే ఈ పిల్ పై విచారణ జరిపేందుకు నిరాకరించింది. సుప్రీంకోర్టు న్యాయవాది సీఆర్ జయ సుకిన్ వేసిన పిల్ పై జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ పీఎస్ నరసింహాతో కూడిన ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ‘‘మీరు ఇలాంటి పిటిషన్లను ఎందుకు దాఖలు చేస్తున్నారో మాకు తెలుసు. దీన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా లేము’’ అని సుప్రీంకోర్టు పేర్కొంది. ‘‘మీకు ఎలాంటి జరిమానా విధించనందుకు సంతోషించండి’’ అంటూ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉంటే, ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా పార్లమెంటు నూతన భవనం ప్రారంభోత్సవం జరగనుంది. అయితే, రాష్ట్రపతి లేకుండా ఈ కార్యక్రమాన్ని ఎలా నిర్వహిస్తారని విపక్షాలు బైకాట్ చేస్తున్నాయి. దీనికి తాము హాజరుకాబోమంటూ ఇప్పటికే జాతీయ, ప్రాంతీయ పార్టీలు కొన్న సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. దీనికి ప్రతిగా బీజేపీ సహా 21 పార్టీలు స్పందించాయి. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ, వైసీపీతోపాటు పలు పార్టీలు మద్దతు తెలిపాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు