- ఓ ఎల్.ఈ.డీ. టీవీల యొక్క అతిపెద్ద శ్రేణిని ప్రారంభించింది
భారతదేశ అగ్రగామి వినియోగ వస్తువుల బ్రాండ్ అయిన ఎల్జీ తాజాగా అంతా ఎంతగానో ఎదురుచూస్తున్న 2023 ఓ ఎల్.ఈ.డీ. విస్తృత శ్రేణిని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన సాంకేతికత లతో గృహ వినోద పరిశ్రమను విప్లవీకరించడాన్ని ఎల్జీ కొనసాగిస్తోంది. 2023 ఎల్జీ వినూత్నతల 10 సంవత్సరాలకు మైలురాయిగా నిలిచింది. ఓ ఎల్.ఈ.డీ. టీవీ సాంకేతికతలో ఎల్జీ మొదటి స్థానంలో ఉంది. కొత్త శ్రేణి లో కీలకమైంది “ప్రపంచంలోనే అతిపెద్ద 246 సీఎం (97) ఓ ఎల్.ఈ.డీ. టీవీ. ఇది ప్రపంచంలోని ఏకైక ఫ్లెక్సిబుల్ గేమింగ్ ఓ ఎల్.ఈ.డీ. టీవీ. ఈ కొత్త శ్రేణి అనుకూలీకరించిన వీక్షణ అనుభవం కోసం 106 సీఎం (42) – 246 సీఎం (97) వరకు ప్రపంచంలోని విస్తృత శ్రేణి ఓ ఎల్.ఈ.డీ. టీవీలను అందిస్తుంది. ఇందులో మొత్తం 21 మోడల్స్ ఉన్నాయి. వీటిలో 8కె జెడ్ 3, ఎవో గ్యాలరీ ఎడిషన్ జి3, ఎవో సి3, బి3, ఎ3 సిరీస్ ఉన్నాయి. తాజా శ్రేణిలో 106 సెం.మీ. (42) నుంచి 246 సెం.మీ. (97) దాకా విస్తృత శ్రేణి టీవీలు అందుబాటులో ఉన్నాయి. ఎల్జీ ఓఎల్ఈడీ తన అత్యుత్తమ పిక్చర్ క్వాలిటీ, వైబ్రంట్, అక్యురేట్ రంగులు, ఇన్ఫినిట్ కాంట్రాస్ట్ రేషియోలకు పేరొందింది. నూతన ఆల్ఫా సిరీస్ అత్యుత్తమ పిక్చర్, శబ్ద నాణ్యం కోసం ఆల్ఫా9 జెన్ 6 ఇంటెలిజెంట్ ప్రాసెసర్ ను కలిగిఉంటుంది. ఎవో టీవీలు మరింత వాస్తవిక చిత్రాలను అందిస్తాయి. ఓఎల్ఈడీ టీవీలు వెబ్ ఓఎస్ తాజా వెర్షన్ తో వస్తాయి. మరింత వ్యక్తిగతీకరించిన అనుభూతిని ఇవి అందిస్తాయి. సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు వీటిలో డాల్బీ విజన్, డాల్బీ అట్మోస్ ఉన్నాయి. ఎల్జీ ఓఎల్ఈడీ టీవీలు గేమింగ్ కోసం ఆప్టిమైజ్ చేయబడ్డాయి. నిర్దిష్ట గేమింగ్ స్పెసిఫిక్ ఫీచర్ల మధ్య అటూ ఇటూ మారడం సులభంగా ఉంటుంది. ఎల్జీ స్మార్ట్ క్యామ్ అనేది వీడియో కాన్ఫరెన్స్ లు, ఫిట్ నెస్ లాంటివాటికి అనుకూలం. బిల్టిన్ డ్యూయల్ మైక్ తో హై డెఫినిషన్ కెమెరా వీటిలో ఉంటుంది. వీటి ధరలు ఓ ఎల్.ఈ.డీ. 42 సి3 యూనిట్ ఒక్కోదానికి రూ. 119,990, రోలబుల్ టీవీ ఒక్కో దానికి రూ. 75, 00,000 లుగా ఉన్నాయి.
తప్పక చదవండి
-Advertisement-