- తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించిన
టీటిడిపి అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ - పార్టీ గెలుపు కోసం తీవ్రంగా పనిచేయాలని పిలుపు..
తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో ఉన్న రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో ఈ సమావేశం నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనుబంధ సంఘాల అధ్యక్షులు పూర్తి స్థాయిలో కమిటీల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించి త్వరగా పూర్తి చేయాలని కోరారు. త్వరలో జరగబోయే బస్సు యాత్రలో అందరూ పాల్గొనాలని, పార్టీ ప్రతిష్టతకోసం కృషి చేయాలని ఆయన కోరారు. అనుబంధ సంఘాలు పార్టీకి వెన్నుముక లాంటివని అవి ఎంత బలంగా పనిచేస్తే పార్టీ అంత బలోపేతం అవుతుందని ఆయన పేర్కొన్నారు. అనుబంధ సంఘాలు రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేయాలని ఆయన కోరారు. అనుబంధ సంఘాలు రాబోయే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామ భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్, బీసీ సెల్ అధ్యక్షులు శ్రీపతి సతీష్, తెలుగు మహిళా అధ్యక్షురాలు షకీలారెడ్డి, తెలుగు యువత అధ్యక్షులు పొగాకు జయరాం, ఎస్సీ సెల్ అధ్యక్షులు పి. అశోక్, టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు పి. రవీందర్, ఎస్టీ సెల్ అధ్యక్షులు కె. గోపి, టీఎన్టీయూసి అధ్యక్షులు ఎం.కె. బోస్, సాంస్కృతిక విభాగం అధ్యక్షులు చంద్రహాస్, లీగల్ సెల్ అధ్యక్షులు రఘు వర్థన్ ప్రతాప్,
గీత కార్మిక సంఘం అధ్యక్షులు గజేంద్రగౌడ్, తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు ముంజ వెంకటరాజం గౌడ్ పాల్గొన్నారు.