Wednesday, May 22, 2024

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఒక చరిత్ర..

తప్పక చదవండి
  • తెలంగాణకు అనుకూలంగా టిడిపి లేఖ కీలకం…
  • ప్రతి ఇంటికి ఉద్యోగం, కడుపు నిండా అన్నం..
  • ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కోసమే నాడు బలిదానాలు.
  • స్వరాష్ట్రం సిద్దించినా కలలు గన్న సమ సమాజం రాలేదు.
  • ఇష్టారాజ్యంగా ఖర్చు చేసి తయానికి నెల జీతాలు ఇవ్వలేని దుస్థితి..
  • ఖజానా ఖాళీ చేసిన నియంతృత్వ పాలనకు ప్రజలు ముగింపు పలకాలి .
  • తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పిలుపు..

హైదరాబాద్, 02 జూన్ ( ఆదాబ్ హైదరాబాద్ ) :
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం ఒక చరిత్ర అని.. ఆ చరిత్రలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుందని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు. తెలంగాణ స్వరాష్ట్రాన్ని సాధించుకున్నప్పటికీ విద్యార్థులు, యువత, అమరవీరులు కలలుగన్న సమసమాజం రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

శుక్రవారం ఎన్టీఆర్ భవన్ లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో రాష్ట్రం ఏర్పడిందన్నారు. ” 1969 తెలంగాణ ఉద్యమ సందర్భంలో మేము యువకులుగా ఉన్నాం. ఆనాడు యువకులుగా ఉన్న విద్యార్థులు తుపాకులకు ఎదురొడ్డి పోరాటం చేసి అమరులయ్యారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం రావడం లేదని యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. పోలీస్ కిష్టయ్య, శ్రీకాంతాచారి వంటి వారు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కోరుకున్నది ఏమిటి అనేది అందరూ ఆలోచించాలి. ప్రతి వ్యక్తి కోరుకున్నది కడుపునిండా అన్నం, ప్రతి ఇంటికి ఉద్యోగం, ఆర్థికంగా బాగుండాలని పోరాటం చేశారు. వారి కలలు నెరవేరలేదన్నారు.. తెలంగాణ రాష్ట్రం వచ్చాక అసలే అభివృద్ధి జరగలేదా? అంటే కొంత జరిగిందని.. కానీ ఏది జరగాలో అది జరగలేదన్నారు. పాత సచివాలయాన్ని కూల్చి కొత్త సచివాలయాన్ని కట్టే ముందు.. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇచ్చామా? యువత ఎందుకు పోరాటాలు చేశారు? అని ఆలోచించాల్సిన అవసరముందన్నారు. ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో చేపట్టిన సకల జనుల సమ్మెలో ప్రతి వ్యక్తి పాల్గొని రాష్ట్రాన్ని స్తంభింపజేశారని, ఆ తర్వాతనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని జ్ఞానేశ్వర్ స్పష్టం చేశారు. “తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం చేసిన పనులను బేరీజు వేస్తున్నాం. ఇష్టారాజ్యంగా ధరలు పెంచడం, ఖజానాను ఖాళీ చేయడం, జీతాలు ఇవ్వలేని పరిస్థితి వంటివి చూస్తున్నాం.
ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసుకుంటున్న బడుగు, బలహీనవర్గాలకు చెందిన ప్రతి వ్యక్తి తనకు ఏరోజు జీతం వస్తుందో తెలియని పరిస్థితిలో ఉన్నారని అన్నారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ రాష్ట్రం రావాల్సిన అవసరమున్నది. ఈ దుష్ట పాలన పోవాలి. అమరవీరుల సాక్షిగా యువత, ప్రజలు ఆలోచించాలి. సమస్యలపై ఎవరైనా నోరెత్తితే పోలీసులు కేసులు పెడుతున్నారు. వీటికి స్వస్తి పలకాల్సిన అవసరమున్నది. ప్రజలు స్పష్టంగా తెలుసుకున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు సరైన సమాధానం చెబుతారు” అన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో జాతీయ పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ తిరునగరి జ్యోత్స్న, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, సామభూపాల్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శులు జక్కలి ఐలయ్య యాదవ్, అజ్మీరా రాజునాయక్, రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధులు నెల్లూరి దుర్గాప్రసాద్, సూర్యదేవర లత, మీడియా వ్యవహారాల కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు సాయి తులసి, పెద్దోజు రవీంద్రాచారి, మూతినేని సైదేశ్వర్ రావు, సంధ్యపోగు రాజశేఖర్, మందూరి సాంబశివరావు, రాష్ట్ర పార్టీ కార్యదర్శులు కె. వెంకట రాములు, అన్నపూర్ణ, టీఎన్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఎం.కె. బోస్, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి, ఎస్సీ సెల్ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పోలంపల్లి అశోక్, తెలుగుయువత రాష్ట్ర అధ్యక్షులు పొగాకు జయరామచందర్, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవీందర్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కాసాని వీరేష్, జివిజి నాయుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఎ.వి. రమణ తదితరులు పాల్గొన్నారు.

కాగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకుల బృందం అసెంబ్లీ ఎదుట గన్ రాక్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కాట్రగడ్డ ప్రసూన, సామ భూపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాజు నాయక్, రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్ బియ్యని సురేష్, రాష్ట్ర అధికార ప్రతినిధులు దుర్గాప్రసాద్, ముప్పిడి గోపాల్, డాక్టర్ ఏ ఎస్ రావు, సూర్యదేవర లత, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బి.షకీలా రెడ్డి, ఆర్గనైజింగ్ సెక్రటరీలు ముత్తినేని సైదేశ్వర్ రావు, రవీంద్రా చారి, సంధ్యపోగు రాజశేఖర్, సాంబశివరావు, ఎస్సి సెల్ అధ్యక్షుడు అశోక్, టి ఎన్ ఎస్ ఎఫ్ అధ్యక్షుడు పి.రవిందర్, రాష్ట్ర నాయకులు ఙివిజి నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు