Friday, October 11, 2024
spot_img

తెలంగాణ సాహిత్య సభలకు నిజామాబాద్ సాహితీ ప్రముఖులు..

తప్పక చదవండి

తెలంగాణ సాహిత్య స‌భ‌ల్లో భాగంగా ఈ నెల 21, 22వ‌ తేదీల్లో హైదరాబాద్ తెలంగాణ సారస్వత పరిషత్‌లో భార‌త జాగృతి తెలంగాణ సాహిత్య అవలోకనం సదస్సు నిర్వ‌హించ‌నుంది. ఈ స‌ద‌స్సుకు నిజామాబాద్ జిల్లాకు చెందిన సాహితీ ప్రముఖులు హాజ‌రు కానున్న‌ట్లు భారత జాగృతి జిల్లా అధ్యక్షులు అవంతి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అధ్యక్షతన జరిగే ఈ సభలలో ప్రముఖ కవి నాళేశ్వరం శంకరం గౌరవ అతిథిగా హాజరు కానున్నారు. జిల్లాకు చెందిన భారత జాగృతి ప్రధాన కార్యదర్శి రంగు నవీనాచారి సాహిత్య సభల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తున్నారు. జిల్లాకు చెందిన హరిదా రచయితల సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్.. తెలంగాణ రేడియో రూపకాలు అనే అంశంపై పత్ర సమర్పణ చేయునున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య త్రివేణి.. తెలంగాణ కథా విమర్శ అనే అంశంపై, ఆచార్య కే లావణ్య తెలంగాణ భాషపై ఉర్దూ పారాశీ భాషల ప్రభావం అనే అంశంపై, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి తెలంగాణ అధి విమర్శ అనే అంశంపై పత్ర సమర్పణ చేయనున్నారు.

డాక్టర్ కాసర్ల నరేశ్ రావు తెలంగాణ గేయ సాహిత్యంపై పత్ర సమర్పణ చేస్తారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రచయితల వ్యాసాలన్నీ తెలంగాణ సాహిత్య అవలోకనం అనే గ్రంథంలో ముద్రితం కానున్నాయి. అలాగే జిల్లాకు చెందిన ప్రముఖ కవులు తిరుమల శ్రీనివాస్ ఆర్య, నరాల సుధాకర్, కంకణాల రాజేశ్వర్, ఆచార్య శ్రీధర, పురాని అజయ్ కుమార్, మేక రామస్వామి, తొగర్ల సురేశ్, మద్దుకూరి సాయిబాబు ఈ సభలకు హాజరు కానున్నారని ఆయన వివరించారు. జిల్లాకు చెందిన సాహిత్య అభిమానులు అందరూ సాహిత్య సభలకు హాజరు కావలసిందిగా ఆయన ఆహ్వానించారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు