Wednesday, October 16, 2024
spot_img

తెలంగాణ ఫార్మా ఇండస్ట్రీ..

తప్పక చదవండి

రాష్ట్రంలో ఫార్మా రంగం అంచనాలకుమించి వృద్ధిని నమోదు చేసుకుంటున్నది. పదేండ్లలో ఫార్మాస్యూటికల్స్‌, బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజ్‌ పరికరాల మార్కెట్‌ 100 బిలియన్‌ డాలర్లు(రూ.8 లక్షల కోట్లకు పైమాటే)కు చేరుకుంటుందన్న అంచనావేసినప్పటికీ, దీంట్లో ఇప్పటికే 80 బిలియన్‌ డాలర్ల(రూ.7 లక్షల కోట్లు)కు చేరుకున్నదని రాష్ట్ర ఐటీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జయేశ్‌ రంజన్‌ అన్నారు. హైదరాబాద్‌లో ఫార్మాలిటికా 2023 ఎక్స్‌పో కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…ఫార్మాలిటికా రంగం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతుండటంతో లక్ష్యాలను సవరించుకోవడం జరిగిందని, భవిష్యత్తులో ఈ పరిశ్రమ 250 బిలియన్‌ డాలర్లకు(రూ.20 లక్షల కోట్లకు పైగా) చేరుకుంటుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. ఎప్పటి లోగా చేరుకునేదానిపై ఆయన సమాచారం ఇవ్వలేదు.

రాష్ట్ర ప్రగతిలో ఫార్మా రంగం కీలక పాత్ర పోషిస్తున్నదన్న ఆయన..ఈ రంగంలో మానవ జోక్యాన్ని తగ్గించి టెక్నాలజీకి పెద్దపీట వేయాలని సూచించారు. ఫార్మాలిటికా లాంటి ఎగ్జిబిషన్‌ వల్ల ఔషధ ఉత్పత్తి సంస్థలకు మేలు చేయనున్నదని, ముఖ్యంగా అడ్వాన్స్‌ టెక్నాలజీ పరికరాలు, యంత్రాలు ప్రయోజనకరంగా ఉంటాయన్నారు. ఈ నెల 3 వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో 16 దేశాలకు చెందిన 250 మంది ప్రతినిధులు, 150 మందికి పైగా ఎగ్జిబిటర్లు తమ ఉత్పత్తులను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌ఫార్మా మార్కెట్స్‌ ఎండీ యోగేశ్‌ ముద్రాస్‌, డిప్యూటీ డ్రగ్స్‌ కంట్రోలర్‌ రాంకిషన్‌, చీఫ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ శంకర్‌గుప్తా, డాక్టర్‌ రెడ్డీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అవినాశ్‌ కుమార్‌ తల్వార్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిటీలోకి రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉన్నదని బీడీఎంఏఐ జాతీయ అధ్యక్షుడు ఆర్‌కే అగర్వాల్‌ తెలిపారు. మహమ్మారి సమయంలో దేశీయ ఫార్మారంగం 5 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా..ప్రస్తుతం 10 శాతానికి చేరుకోనున్నదని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు