Saturday, May 4, 2024

పేస్ బుక్ పరిచయం.. ప్రమాదంగా మారింది..

తప్పక చదవండి

ఫేస్‌బుక్‌లో పరిచయమైన 11 ఏళ్ల బాలికను ఒక వ్యక్తి నిర్బంధించాడు. సుమారు రెండేళ్లుగా ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అతడు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు చివరకు ఆ బాలికను రక్షించారు. మహారాష్ట్రలోని లాతూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఔరద్ షాజనీ ప్రాంతానికి చెందిన మనుద్దీన్ బాదురేకు ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు చెందిన 11 ఏళ్ల బాలికతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. దీంతో అతడు గొరఖ్‌పూర్‌ వచ్చి కొంత కాలం ఉన్నాడు. ఆ బాలికను లోబరుచుకున్నాడు. 2021 డిసెంబర్‌ 24న ఆమెను లాతూర్‌లోని తన ప్రాంతానికి రప్పించాడు.

కాగా, బాలిక కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఆమె గదిలోని వస్తువులను తనిఖీ చేయగా రెండు మొబైల్‌ ఫోన్లు కనిపించాయి. ఒక ఫోన్‌లోని మొబైల్‌ నంబర్‌కు కాంటాక్ట్‌ చేశారు. మాట్లాడిన వ్యక్తి తన పేరు షేక్‌ అని తెలిపాడు. ఆ బాలిక తన వద్ద ఉన్నదని చెప్పాడు. తిరిగి ఇంటికి రాదని, ఆమె గురించి మరిచిపోవాలని కుటుంబ సభ్యులను హెచ్చరించాడు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

- Advertisement -

మరోవైపు కిడ్నాప్‌ కేసు నమోదు చేసిన ఉత్తరప్రదేశ్‌ పోలీసులు, ఆ బాలిక ఆచూకీ కోసం ఏడాదిన్నర కాలం పాటు ప్రయత్నించారు. ఆమెను బంధించిన వ్యక్తి మహారాష్ట్రలోని లాతూర్‌లో ఉన్నట్లు మొబైల్‌ నంబర్‌, సాంకేతిక ఆధారాల ద్వారా గుర్తించారు. దీంతో యూపీ పోలీసులు ఇటీవల ఆ ప్రాంతానికి వెళ్లారు. ఏడాదిన్నరపైగా బాలికను నిర్బంధించిన మనుద్దీన్‌ను అరెస్ట్‌ చేశారు. అతడి చెరలో ఉన్న ఆమెను రక్షించారు. వారిద్దరినీ గోరఖ్‌పూర్‌కు తీసుకువచ్చారు. సుమారు రెండేళ్లుగా ఆ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆ వ్యక్తి పోలీసులకు చెప్పాడు. దీంతో నిందితుడిపై పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు