Sunday, September 8, 2024
spot_img

దివ్యాంగుల కోసం ప్రభుత్వం కృషి : మంత్రి తలసాని

తప్పక చదవండి

దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దివ్యాంగులకు మరో వెయ్యి రూపాయల పెన్షన్ ను పెంచడం పట్ల ఆదివారం జలవిహార్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి దివ్యాంగులతో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రూ. 500 ఉన్న పెన్షన్‌ను రూ. 1500, రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 3016, ప్రస్తుతం మరో వెయ్యి పెంచి రూ మనసున్న మారాజు అని నిరూపించుకున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సబ్సిడీ పై పరికరాలు ఇవ్వగా తమ ప్రభుత్వం ఉచితంగా అందిస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, దానం నాగేందర్, ముఠా గోపాల్, కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవ రెడ్డి, గజ్జెల నగేష్, నగర గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రసన్న, దివ్యాంగుల సంఘం ప్రతినిధులు యాదగిరి, భాస్కర్, దివ్యాంగుల ఇండియన్ క్రికెట్ కెప్టెన్ మహేష్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు