- 76 కిలోల లడ్డూతో గ్రాండ్ గా వేడుకలు..
బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఆదివారం 76వ ఏట అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలు, కార్యకర్తలు బహుమతిగా ఇచ్చిన 76 కిలోల భారీ లడ్డూతో 76వ పుట్టిన రోజును జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తల సమక్షంలో బర్త్ డేను సెలబ్రేట్ చేసుకున్నారు. బీహార్ మాజీ సీఎం, భార్య రబ్రీ దేవి అధికార నివాసానికి పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. జేడీయూ చీఫ్ లాలన్ సింగ్, బీహార్ స్పీకర్ అవద్ బిహారీ చౌదరి తదితరులు లాలూ ప్రసాద్‌కు స్వయంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంతోపాటు మిఠాయిలను బహూకరించారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ కూడా ఫోన్‌లో లాలూతో మాట్లాడి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ మంత్రి తేజస్వీ యాదవ్ ఈ సందర్భంగా ఒక ట్వీట్ చేశారు. ‘సామాజిక న్యాయానికి మార్గదర్శకుడు, వ్యక్తిత్వంలో సంపన్నుడు, బలమైన వ్యక్తిత్వం, బీహార్‌కు కీర్తి ప్రతిష్టలు తెచ్చిన గౌరవనీయులైన లాలూజీకి హృదయ పూర్వక అభినందనలు, శుభాకాంక్షలు’ అని పేర్కొన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ తన కుటుంబ సభ్యులతో కలిసి బర్త్ డే జరుపుకున్న ఫొటోలను అందులో పోస్ట్ చేశారు.
తప్పక చదవండి
-Advertisement-