Monday, September 9, 2024
spot_img

కాంగ్రేస్ టార్గెట్ 100 సీట్లు

తప్పక చదవండి
  • మంత్రులకు ఓటమి తప్పదని చెబుతున్న సర్వేలు
  • బలమైన అభ్యర్థుల కోసం వేట మొదలెట్టిన కాంగ్రేస్
  • గతంలో పార్టీ వీడిన వారిపై కూడా ప్రత్యేక శ్రద్ద
  • పార్టీ మారితే ఎలా ఉంటుందని చూపే ప్రయత్నం
  • తొలుత పార్టీని వీడిన 12 మందిపై స్సెషల్ ఫోకస్
  • ఆ తర్వాత గెలుపు గుర్రాలపై పూర్తిస్థాయిలో కసరత్తు
  • గెలుపే లక్ష్యంగా టీమ్ ను సిద్ధం చేసుకుంటున్న రేవంత్
  • ఊహించని అభ్యర్థులు బరిలో ఉంటారని గాంధీభవన్ లీకులు

( పొలిటికల్ కరెస్పాండెంట్ ” వాసు ” )

గడిచిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గుర్తుతో గెలిచి .. ఆ తర్వాత అధికార పార్టీ తీర్ధం పుచ్చుకున్న 12 మంది ఎమ్మెల్యేలఫై కాంగ్రేస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రధానంగా దృష్టిసారించినట్లు తెలుస్తోంది.. వీరితో పాటు కేసీఆర్ మంత్రి వర్గంలో పనిచేస్తున్న కీలకమంత్రులపై కూడా అయన ద్రుష్టి సారించారు. ఒక పార్టీలో బీ-ఫామ్ తీసుకుని ఆ పార్టీ గుర్తుపై ఎన్నికల్లో గెలిచి ఆ తర్వాత వేరే పార్టీలోకి ఫిరాయిస్తే ఎలా ఉంటుందన్న విషయాన్ని పార్టీని వీడినవారికి అర్ధమయ్యేలా జవాబు చెప్పాలన్నదే రేవంత్ లక్ష్యంగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కేసీఆర్ మంత్రి వర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న పట్లోళ్ల సబిత ఇంద్రా రెడ్డితో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచి ఆ తర్వాత భారాసలో చేరిన విషయం తెలిసిందే. ఇందులో ఎక్కువ మంది రిజర్వుడ్ నియోజక వర్గాల నుంచే పోటీ చేసి గెలిచిన అబ్యర్ధులే ఉన్నారు. బీరం హర్ష వర్ధన్ రెడ్డి , రోహిత్ రెడ్డి, సబిత ఇంద్రారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి ఆత్రం సక్కు, జాజల సురేందర్, రేగ కాంతారావు, బానోతు హరిప్రియ, కందాల ఉపేందర్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి కొంత కాలం పార్టీలో కొనసాగి ఆ తర్వాత అధికార పార్టీకి దగ్గరయ్యారు. తమ నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నట్టు అప్పట్లో వారు ప్రకటించుకున్నారు.

- Advertisement -

మంత్రులకు ఫలితాలు ప్రతికూలంటూ కాంగ్రేసుకు సమాచారం
అధికార పార్టీలో కీలక విభాగాల్లో చక్రం తిప్పుతున్న పలువురు మంత్రులకు ఈ సారి భంగపాటు తప్పదని కాంగ్రేస్ భావిస్తుంది.ఈ మేరకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు వారి స్వంత నియోజక వర్గాల్లో ప్రయివేట్ ఏజెన్సీల ద్వారా సర్వే చేయించుకున్నట్లు తెలుస్తుంది. ఆ సర్వేలోని అంశాలు అధికార పార్టీ అభ్యర్థులకు పూర్తిగా ప్రతికూలమన్న సంకేతాలు కాంగ్రేస్ కు చేరాయి. దీంతో రేవంత్ రెడ్డి రెట్టింపు ఉత్సహంతో తానూ పనిచేస్తూ కార్యకర్తలకు పనిచేయాలని సూచించడమే గాక నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని ఆశావాహులను ఆదేశించినట్లు తెలిసింది. ప్రజల్లో బలమున్న నేతలకు టికెట్ ఇస్తామంటూ గాంధీభవన్ నుంచి స్పష్టమైన సంకేతాలిచ్చిన రేవంత్ ఈ ఎన్నికలను తాము చాల ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్లు చెబుతున్నారు. బలమైన అధికార పార్టీ అభ్యర్థులపై ఎవరూ ఊహించని అభ్యర్థులు కాంగ్రేస్ పార్టీ తరపున ఎన్నికల బరిలో ఉంటారని గాంధీభవన్ నుంచి లీకులు వెలువడుతున్నాయి.

కాంగ్రేస్ వ్యూహాలకు ప్రతీ వ్యూహాలను రచిస్తున్న భారాస
రాజకీయాల్లో కొందరి నేతల వ్యూహాలు సాదారణంగా ఎవ్వరికి అంతుచిక్కవు. . అందులోనూ తనదైన పొలిటికల్ ప్లాన్స్ తో ప్రత్యర్థులను చిత్తు చేసే బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలు ఎవరి ఊహాలకు అందవు . ముఖ్యంగా ఎన్నికల్లో తన ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు కేసీఆర్ అమలు చేసే వ్యూహాలు మరింత భిన్నంగా ఉంటాయి. తాజాగా తెలంగాణలో బలం పుంజుకుంటున్నట్టు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ మరోసారి ఎలాంటి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారన్నదానిపై సర్వ్త్ర ఆసక్తి నెలకొంది.కొద్దిరోజుల క్రితం వ్యవసాయానికి మూడు గంటల ఉచిత విద్యుత్ అనే కామెంట్స్ చేసిన టీపీసీసీ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలఫై తెలంగాణ రాజకీయాల్లో పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీఆర్ఎస్ ఆందోళనలు కూడా చేపట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ ముఖ్యనేతలు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేందుకు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలనే ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే మూడు గంటల కరెంట్ ఇస్తారనే ప్రచారం బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున చేపట్టారు.

అంతర్గత కుమ్ములాటలే కాంగ్రేస్ కు మైనస్
కాంగ్రేస్ పార్టీలోని నాయకులకు కాస్త క్రమశిక్షణ తక్కువనే చెప్పాలి. ఇష్టానుసారంగా మాట్లాడటం తరువాత దానిని భావ స్వేచ్ఛగా కలరిచ్చుకోవడం వాళ్లకు కొత్తేమి కాదు. తాము నమ్ముకున్న పార్టీపైనే .. నేతలపైనే ఇష్టానుసారంగా నోరుపారేసుకోవడం తరువాత నాలిక కర్చుకోవడం కాంగ్రేస్ నాయకులకే చెల్లుతుంది. ఇలాంటి
స్వయంకృత అపరదాలే కాంగ్రేసుకు మైనస్ అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాంగ్రేసుకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పటికీ స్వంత పార్టీ నేతల్లోని కొందరి మాటలు, ప్రవర్తన పార్టీ కి తీవ్రమైన నష్టాన్ని చేకూరుస్తున్నాయని స్వంత పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు. దీంతో గతంలో విజయ అవకాశాలు చేజారిపోయాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ వారి అడుగులకు మడుగులొత్తుత్తున్న నాయకులకు అర్ధం కానీ విషయం ఏంటంటే .. తమ పార్టీ (కాంగ్రేస్) అధికారం కైవసం చేసుకుంటే అదే నాయకులు తమ చుట్టూ తిరుగుతారన్న నిజాన్ని గ్రహించకపోవడం..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు