Saturday, July 27, 2024

పర్యావరణ పరిరక్షణే భవిష్యత్‌ తరాలకు కానుక..

తప్పక చదవండి

ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షిస్తూ పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని రాష్ట్ర మత్స్య, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. సోమవారం మోండా డివిజన్‌ వెస్ట్‌మారేడ్‌పల్లి నెహ్రూనగర్‌ పార్కులో హరితహారం కార్యక్రమం నిర్వహించగా మంత్రి పాల్గొని మొక్కలను నాటారు. పార్కులో వాకర్ల కోసం నిర్మించిన షెడ్డును ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ భవిష్యత్‌ తరాలను దృష్టిలో పెట్టుకొని పర్యావరణాన్ని కాపాడాలన్నారు. సీఎం కేసీఆర్‌ కృషి, పట్టుదలతో రాష్ట్రంలో పచ్చదనం పెరిగిందన్నారు. ముఖ్యంగా హరితహారం ద్వారా కొట్లాది మొక్కలు నాటి పరిరక్షిస్తున్నామని తెలిపారు.

పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో అర్బన్‌ ఫారెస్ట్‌ల ఏర్పాటుతో 7.7 శాతం పచ్చదనం పెరగడం.. అంతేకాక అడవుల పెంపకంలో తెలంగాణ రాష్ట్రం మొదటి వరుసలో ఉండటం ఆనందంగా ఉందన్నారు. ఈ ఒక్క రోజే నగరంలో 60 పార్కులు ప్రారంభం అవుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్‌లు గజ్జెల నాగేష్‌, ఏర్రోళ్ల శ్రీనివాస్‌, జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, ఈఈ సుదర్శన్‌, కార్పొరేటర్‌ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్‌ ఆకుల రూప, లాస్యనందిత, పార్కు అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు హన్మంతరావు, సీనియర్‌ సిటీజన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వెంకట్‌రావు, మాజీ అధ్యక్షుడు కుమార్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు