టాక్ సంగతి అటుంచితే గతవారం ‘ఆదిపురుష్’ హవానే నడిచింది. దాదాపు రెండు నెలల తర్వాత థియేటర్‌లో పెద్ద సినిమా రిలీజవడం.. అందులోనూ రామాయణం వంటి గొప్ప కథ రానుండటంతో తిరుగులేని హైప్ నెలకొంది. రిలీజయ్యాక నెగెటివ్ రివ్యూలు జోరందుకున్నా.. కలెక్షన్‌లు మాత్రం వీర లెవల్లో వచ్చాయి. తొలిమూడు రోజుల్లోనే మూడోందల నలభై కోట్లు కలెక్ట్ చేసి ఆహా అనిపించింది. ఇక సోమవారం నుంచి ఈ సినిమా పూర్తిగా డల్ అయిపోయింది. ఇక ఈ సినిమాకు పాజిటీవ్ టాక్ వస్తే గనుకు మరో రెండు వారాల వరకు మరో సినిమా ఊసే ఉండేది కాదు. కాగా ఆదిపురుష్ జోరు తగ్గడంతో ఈ వారం రిలీజ్‌కు చిన్న సినిమాలు క్యూ కట్టాయి. ఇక ఈ వారం ప్రేక్షకులను కనివిందు చేయడానికి బోలెడన్ని సినిమాలు ముస్తాబవుతున్నాయి. థియేటర్‌తో పాటు ఓటీటీలోనూ పలు బ్రహ్మండమైన సినిమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. పుష్పతో తెలుగు ఆడియెన్స్‌లో తిరుగులేని క్రేజ్ తెచ్చుకున్నాడు ఫాహద్ ఫాజిల్. ఆయన హీరోగా ధూమమ్ అనే థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్లు మంచి హైప్‌నే తెచ్చిపెట్టింది. కాగా ఈ సినిమా జూన్ 23న విడుదల కాబోతుంది. పవన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళీ హీరోయిన్‌గా నటించింది. శివ కందుకూరి హీరోగా భరత్ పెద్దగాని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. వారం రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ కాస్త మంచి అంచనాలు క్రియేట్ చేసింది. సుహాస్, ధనంజయ వంటి స్టార్‌కాస్ట్ ఈ సినిమాలో నటించారు. గోపి సుందర్ స్వరాలందించిన ఈ సినిమాలో మేఘా ఆకాశ్ హీరోయిన్‌గా నటించింది.