తమిళనాడు విద్యుత్తు శాఖ మంత్రి వీ సెంథిల్ బాలాజీ తో పాటు మరికొంత మంది ఇండ్లల్లో సోమవారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సోదాలు నిర్వహించింది. మనీల్యాండరింగ్ కేసులో ఆ సోదాలు జరిగాయి. సెక్రటేరియేట్‌లో ఉన్న మంత్రి బాలాజీ ఆఫీసు రూమ్‌లోనూ తనిఖీలు చేపట్టారు. గతంలో అన్నాడీఎంకే పార్టీలో ఉన్న బాలాజీపై జాబ్స్ స్కామ్ ఆరోపణలు ఉన్నాయి. లంచం తీసుకుని ఉద్యోగాలు ఇప్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ కేసులో ఈడీ విచారణకు గతంలో సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కారూర్ జిల్లాకు చెందిన డీఎంకే నేత అయిన బాలాజీ ఇప్పుడు పార్టీలో కీలకంగా మారారు. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖ మంత్రిగానూ బాలాజీ చేస్తున్నారు. ఇవాళ మార్నింగ్ వాక్ వెళ్లిన సమయంలో మంత్రి ఇంట్లోకి ఈడీ అధికారులు తనిఖీల కోసం వెళ్లారు.