Tuesday, September 10, 2024
spot_img

ఇన్‌స్టాగ్రామ్‌లో రేటింగ్‌ పేరుతో మోసం..

తప్పక చదవండి

ఆన్‌లైన్‌లో వచ్చే లింక్స్‌, మోసపూరిత ప్రకటనలను నమ్మొద్దని ఎంత హెచ్చరించినా కొందరి తీరు మారట్లేదు. అత్యాశకు వెళ్లి జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. తాజాగా సైబర్‌ నేరగాళ్ల మాయమాటలు నమ్మి ఓ మహిళా టెక్కీ కోటిన్నర వరకు పోగొట్టుకుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో తాము సూచించిన పేజీలకు రేటింగ్‌ ఇస్తే కమీషన్ల రూపంలో డబ్బులు ఇస్తామని సైబర్‌ నేరగాళ్లు హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళా టెక్కీకి ఆశజూపారు. అది నమ్మిన టెక్కీ అందుకు ఒప్పుకుంది. వాళ్లు చెప్పిన పేజీలకు రేటింగ్‌ ఇచ్చినందుకు మొదట కొంత నగదు కూడా చెల్లించి ఆమెను నమ్మించారు. ఆ తర్వాత తమతో పాటు పెట్టుబడి పెడితే బోలెడంత డబ్బు సంపాదించుకోవచ్చని నమ్మబలికారు. వాళ్ల మాయమాటలు నమ్మిన సదరు టెక్కీ పెట్టుబడి కింద డబ్బులు చెల్లించింది. అలా విడతలవారీగా రూ.1.50 కోట్లను సైబర్‌ నేరగాళ్లకు సమర్పించుకుంది. ఆ తర్వాత మోసపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు