Monday, May 6, 2024

సాంకేతిక పరిజ్ఞానంలో వేగం పెరిగింది..

తప్పక చదవండి
  • ఆ దిశలో ఐటిడిపి విభాగం సత్తా చాటాలి..
  • తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలిసే విధంగా ఉండాలి..
  • బస్సు యాత్రలోనే అభ్యర్థుల ప్రకటన..
  • భవిష్యత్తులో టిడిపి రాష్ట్రంలో ఏమి చేస్తుందో వివరిస్తాం..
  • తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్..

సాంకేతిక పరిజ్ఞానం వేగం పెరిగింది.. ఆ దిశలో ఐటిడిపి ప్రయాణిస్తూ, క్షణాల్లో ప్రతి సమస్యకు పరిష్కారం తెలుపుతూ ముందుకు వెళ్లాలని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పేర్కొన్నారు. శనివారం తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘం ఐటిడిపి ప్రమాణ స్వీకార కార్యక్రమం హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ విచ్చేశారు. ఐటిడిపి రాష్ట్ర అధ్యక్షుడుగా తాళి కోట హరికృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. సాంకేతిక పరిజ్ఞానం వేగంగా పరిగెత్తుతున్న దిశలో.. ఐటిడిపి ప్రమాణ స్వీకారంతో వారి యొక్క బాధ్యత పూర్తిస్థాయిలో పెరిగిందన్నారు. ఆరు నెలల కాలంలో ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో.. ఐటిడిపి మండల డివిజన్ స్థాయి కమిటీలు వేసుకొని నిరంతర ప్రక్రియ చేపట్టాలన్నారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో వివిధ ఛానల్లో పాల్గొనే అధికార ప్రతినిధులకు సలహాలు సూచనలు ఇస్తూ.. వారికి చేదోడువాదోడుగా ఉండాలని తెలిపారు. నేడు మీడియా ఎంత వేగంగా ఉందో అంతకంటే ఎక్కువ వేగంతో.. ఐటిడిపి యువత, ప్రజలను ఆకర్షించే విధంగా ఉండాలని.. నాటి నుండి నేటి వరకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో ఏం చేస్తుందో.. ఏం చేయబోతుందో.. అనే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నిరంతరం ప్రజలకు చేరువేసేందుకు ముందుండాలని కోరారు. ఏదైనా విషయన్ని ప్రజలకు తెలిపేందుకు. మంచి పదాలతో సున్నితంగా గౌరవించే విధంగా ఉండాలన్నారు. అన్ని రాజకీయ పార్టీలు చేసే పోస్టులా కాకుండా.. తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం.. ఐటీడీపీ పెట్టే పోస్టులు చాలా అద్భుతంగా ఉండాలని అందర్నీ ఆకర్షించే విధంగా ఉండాలని.. పూర్వ వైభవం కోసం ఐటీడీపీ కీలక భాగస్వామ్యంగా ఉండి ముందుకు వెళ్లాలని వారికి సూచించారు. అదే విధంగా అందరికీ స్పీడ్ గా మెంబర్షిప్ ఇస్తూ.. దానిని నిరంతరం ప్రక్రియతో.. ముందుకు వెళ్లాలని స్పష్టం చేశారు. ఏమైనా తప్పిదాలు జరిగిన అప్పటికప్పుడు లీగల్ టైమ్ లో.. లీగల్ గా వెళదామని తెలిపారు. అన్ని అనుబంధ విభాగాలతో… తెలుగుదేశం పూర్వ వైభవం కోసం కృషి చేయాలని.. నేడు పోటాపోటీగా పరిగెడుతున్న పార్టీలు చివరికి అలిసిపోయే పరిస్థితి లేక పోలేదని.. అ సమయం లో టిడిపి పార్టీలో సంసిద్ధతగా ఉంటే కంకణ బద్దులుగా ఉండి వెంటనే ఈ రోజు పని ఇప్పుడే చేయాలనే విధంగా కొనసాగుతూ.. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఎలా నిర్వహించారో.. అదే విధంగా ఎన్టీఆర్, చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని కోరారు.. టీడీపి గతంలో ఏమి చేసింది.. ఏమి చేస్తుంది.. ఏమి చేయాలో బస్సుయాత్ర లోనే వివరిస్తూ.. అభ్యర్ధుల ను ప్రకటిస్తాం.. బీదవాణ్ణి కోటీశ్వరులుగా మార్చే
ప్రక్రియ జరుగుతుందన్నారు. విజన్ 2020 కాదు 15 సంవత్సరాల్లో తూచ.. తప్పకుండా ప్రక్రియ జరుగుతుందన్నారు. పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. మెడ నిండా రుద్రాక్షలు.. నోటి నిండా భూతులు మాట్లాడే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక మంత్రి మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అలాంటి పోస్టులు కాకుండా సాంకేతిక నిపుణుల విభాగం చాలా జాగ్రత్తగా పోస్టులు పంపించలన్నారు. ప్రతి వారానికి 10 రోజుల కొకసారి రివ్యూ మీటింగ్ పెట్టుకోవాలి.. సాంకేతిక పరిజ్ఞానం పెంచుకోవాలని అన్నారు. ఇంటింటికీ తెలుగుదేశం సక్సస్ అయే విధంగా.. సోషల్ మీడియాలో పార్టీ అభివృద్ధి, ప్రభుత్వాల తప్పిదాలను వేలెత్తి చూపుతూ.. ప్రజల ముందుకు వెళ్లాలన్నారు. జాతీయ అధికార ప్రతినిధి టి. జ్యోత్స్న మాట్లాడుతూ.. ఐటీడిపి విభాగం ముందుకు వెళ్లాలని.. ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం ఎండగడుతూ.. చిన్న చిన్న తప్పులను ప్రజలకు తెలిసే విధంగా బట్టబయలు చెయాలన్నారు. శేజల్ సమస్య ముందుకు రావడం సోషల్ మీడియాలో కీలక పాత్ర పోషించింది.. ఆ ఘనత సోషల్ మీడియాదే నన్నారు. రాగ ద్వేషాలకు తావులేకుండా ముందుకు వెళ్లాలని సూచించారు. జాతీయ కార్యదర్శి కాసాని విరేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో తెలుగుదేశం చేస్తున్న రోజు వారి కార్యక్రమాలు నిత్యం సోషల్ మీడియాలో ఉండాలని తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు నందమూరి సుహాసిని మాట్లాడుతూ.. సోషల్ మీడియా విభాగం చాలా అద్భుతంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి జక్కిలి ఐలయ్య, రాష్ట్ర నాయకులు రాజు నాయక్, మల్కజిగిరి పార్లమెంట్ అధ్యక్షులు అశోక్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు శ్రీపతి సతీష్, ఆదిలాబాద్ పార్లమెంట్ అధ్యక్షుడు ఆనంద్, చంద్ర హాసన్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు