Sunday, May 19, 2024

కాలేజీ విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలి..

తప్పక చదవండి

14 లక్షల మంది కాలేజీ విద్యార్ధుల 5 వేల కోట్ల రూపాయల ఫీజుల బకాయిలు విడుదల చేయాలనీ, స్కాలర్ షిప్ లు పెంచాలని, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య పిలుపు మేరకు కలెక్టరే ట్ కార్యాలయాల ముట్టడి కార్యక్రమం జరిగింది.. ఈ కార్యక్రమం ముదిరాజ్ బిసి యువజన సంఘం యూత్ అధ్యక్షులు పండుగ హరీష్ ఆధ్వర్యంలో జరిగింది..

ఇంజినీరింగ్ – డిగ్రీ – పి.జి. తదితర కాలేజి కోర్సులు చదివే 14 లక్షల మంది ఎస్సి ఎస్టీ బిసి మైనారిటీ విద్యార్థుల గత రెండు సంవత్సరాల ఫీజులు బకాయిలు 5వేల కోట్లు విడుదల చేయాలని, పెరిగిన ధరల ప్రకారం స్కాలర్ షిప్ రెండు రెట్లు పెంచాలని జనగామ బి.సి సంక్షేమ సంఘం యూత్ అధ్యక్షులు, పండుగ హరీష్ ముదిరాజ్ పిలుపునిచ్చారు. ఉద్యమాన్ని ఉదృతం చేయడంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు ముట్టడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాo బీసీలకు బడ్జెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. గత రెండు సంవత్సరాల ఫీజుల బకాయిలను చెల్లించకపోవడంతో కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. క్లాసుల నుంచి బయటకు పంపి ఎండలో నిలబెట్టి అవమాన పరుస్తున్నారు. అంతేగాక కోర్సు పూర్తయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్నారు. దీని మూలంగా డిగ్రీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మొత్తం ఫీజులు విద్యార్థులు కట్టిన తర్వాతనే సర్టిఫికెట్లు ఇస్తామంటున్నారు. ఇంకా రెండవ సంవత్సరం, మూడవ సంవత్సరం విద్యార్థులకు కూడా ఫీజులు కట్టాలని ఒత్తిడి తెస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన తర్వా త విద్యార్థులకు వాపస్ ఇస్తామని అంటున్నారు. ఫీజులు కట్టలేక పోతే క్లాసులకు రానివ్వటం లేదు. దీని మూలంగా విద్యార్థుల చదువు దెబ్బతింటుందని గుర్తు చేశారు. పి.జి కోర్సులలో సీట్లు పొందిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఉద్యోగాలు పొందినవారు ఇతర దేశాలలో ఉద్యోగాలు వచ్చిన వారికి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. హాల్ టికెట్లు ఇవ్వడం లేదు. విద్యార్థులను క్లాసులకు రానివ్వడం లేదు. ఫీజులు రాకపోవడంతో చదువుకోవడం ఇబ్బందిగా తయారైందన్నారు. దీనితో విద్యార్థులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. పేద కులాలు చదువుకుంటే సంపన్న వర్గాల దోపిడీ పాలన అంతమవుతుందని భయపడుతున్నారు. చదువు ద్వారా పేద కులాలలో చైతన్యం పెరిగి రాజ్యదికరం దిశగా ఉద్యమాలు వస్తాయని భయపడుతున్నారు.
అలాగే ఇంజనీరింగ్/ఎంబీఏ/ఎంసీఏ/పీజీ/డిగ్రీ/ఇంటర్ తదితర కాలేజీ కోర్సులు చదివే బీసీ విద్యార్థుల మొత్తం ఫీజుల స్కీమును పునరుద్ధరించాలని కోరారు. ఎస్.టి/ఎస్.సి/మైనారిటీ విద్యార్థులకు ఇస్తున్న మాదిరిగా బిసి/ఇబిసి విద్యార్థులకు కూడా పూర్తి ఫీజులు మంజూరు చేయాలని కోరారు. 10 వేల ర్యాంకు వరకు పూర్తి ఫీజులు మంజూరు చేస్తూ మిగతా వారికి కేవలం 35 వేలు మంజూరు చేస్తున్నారు. మిగితా బాలన్స్ ఫీజులు కట్టలేక చాలామంది చదువు మానేస్తున్నారని అన్నారు. అందుకే మొత్తం ఫీజులో మంజూరు చేయాలని కోరారు.

- Advertisement -

అలాగే పెరిగిన ధరల ప్రకారం కాలేజి విద్యార్థుల మెస్ చార్జీలు, ఇంటర్, డిగ్రీ వారికి సం.రానికి రూ. 5500 నుంచి రూ. 20 వేలకు, ఇంజినీరింగ్, పి.జి కోర్సుల వారికి రూ. 6500 నుంచి రూ. 20 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా బిసి నాయకులు పండుగ అశోక్, చింతకింది హరీష్, దాసరి అశోక్, కడకంచి కరుణాకర్, విద్యార్థులు వంగాల శ్రీకాంత్, చెవ్వ రమేష్, కార్తీక్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు