Wednesday, June 19, 2024

స్వర్గీయ బుచ్చిలింగం 4 వ వర్ధంతి కార్యక్రమాలు..

తప్పక చదవండి

హైదరాబాద్, మంగళవారం రోజు ఆదిలాబాద్ పార్లమెంట్ లోని కాగజ్ నగర్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ బుచ్చిలింగం 4వ వర్ధంతిని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ తో కలిసి అక్కడున్న రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అంతకుముందు స్థానిక పద్మశాలి భవనంలో స్వర్గీయ బుచ్చిలింగం నాలుగవ వర్ధంతిని కుల సోదరులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించి, వారు చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.. ఆయన చిన్న వయసులోనే కాగజ్ నగర్ మున్సిపల్ చైర్మన్ గా పనిచేసిన రోజుల్లో పట్టణ అభివృద్ధి కోసం పాటుపడ్డాడని, తాను నమ్మిన సిందంతాలకు కట్టుబడి ఉన్న మహా మనిషి అని, అలాగే తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణతో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేసిన వ్యక్తి అని బుచ్చిలింగం చేసిన సేవలను కొనియాడారు.. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సిహెచ్ ప్రభాకర్, గులాబ్ రావు, ఎల్ మధుకర్, చల్లురి శంకర్, మాకబుల్, తహెర్, గులబ్, సమ్మగౌడ్, సత్యనారాయణ, సురేందర్ తదితరులు పాల్గొన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు