Friday, October 11, 2024
spot_img

సైబరాబాద్‌ లో సక్సెస్‌ కిల్లర్‌…

తప్పక చదవండి
  • ఇన్ఫినిటీ ఫుడ్ కోర్టు అంటూ ఇష్టానుసారంగా డ్ర‌గ్స్ సప్లయ్..
  • టీనేజ‌ర్స్ టార్గెట్ గా డ్రగ్స్ పార్టీలు.. డ‌బ్బున్న పిల్లల పై మత్తు వ‌ల‌..?
  • తాజాగా డ్ర‌గ్స్ కేసులో కేవలం కన్స్యూమర్ మాత్రమే అంటూ క‌ల‌రింగ్..
  • నగరంలో ర‌ఘు తేజ ఫ్యామిలి ఎంజాయ్ చేయని ప‌బ్స్ లేనేలేవు..
  • పెద్ద‌వారి పార్టీలకు అటెండ్ ఆవుతో అంతా తామే అంటారు.
  • గోవాకి ఫ్లయిట్ లో పోవడం.. బ‌స్సులో రావడం..
  • మాముళ్ల మత్తు జల్లి క‌ళ్లు మూయించేస్తాడు..
  • డ్రైవ్ ఇన్ కూల్చేసిన .. డ్రగ్స్ దందా వదలడం లేదు.
  • ఇంతలా రెచ్చిపోతున్న కిలాడీ కుటుంబానికి అండ ఎవ‌రు..? ఇత‌ని ధైర్యం ఎంటీ..?
  • యూత్ కిల్లర్ రఘు తేజ గురించి తెలియ‌ని భ‌యంక‌ర‌ నిజాలు మీ ముందుకు..

డ్రైవ్‌ ఇన్‌ పేరుతో దర్జాగా డ్రగ్స్‌ దందా నడిపించాడు రఘు తేజ.. గచ్చిబౌలిలోని ఎఫ్‌సీఐ కాలనీలో 2 ఎకరాల ఓపెన్‌ ప్లేస్‌ వుంది.. ఇక్కడ అక్రమంగా రోడ్లు కబ్జా చేసి ఇన్ఫినిటీ ఫుడ్‌ విలేజ్‌ని నిర్మించాడు. ఇక్కడే పార్టీల పేరుతో డ్రగ్స్‌ దందా నడిపిస్తున్నాడని అరోపణలు ఉన్నాయి. సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు, హాస్టల్స్‌ అమ్మాయిలకు ఫ్రీ గా వెల్‌ కమ్‌ చెబుతాడు.. బడాబాబుల పిల్లలను రాయితీ పేరుతో రప్పిస్తాడు. ఇలా మూడేళ్ల క్రితం మొదలెట్టిన బిజినెస్‌ సైబరాబాద్‌ నుంచి బంజారాహిల్స్‌ వరకు చేరుకుంది. డ్రైవ్‌ ఇన్‌ హోటల్‌ న్యూసెన్స్‌ భరించలేక ఇతగాడి ఇల్లీగల్‌ నిర్మాణాన్ని కోర్టుకు వెళ్లి కూల్చివేయించారు స్థానికులు.. అయినా ఇప్పటికీ అక్కడే మకాం వేసి డ్రగ్స్‌ దందా కొనసాగిస్తున్నారని నిఘా వర్గాలు సమాచారం రాబట్టాయి. కానీ స్థానిక పోలీసులు, అధికారులు, కొందరు మీడియా మిత్రులు మాముళ్ల మత్తులో మునుగుతూ ఈ తతంగాన్ని పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ఈ నెల 5న రాయదుర్గం పోలీసులకు పట్టుపడిన వారిలో రఘుతేజ కేవలం డ్రగ్స్‌ వినియోగదారుడిగానే గుర్తించి 10 రోజుల పాటు స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెట్టమన్నారు పోలీసులు. కానీ రోజుకు ఎంత వినియోగిస్తున్నాడు..? ఇతని వద్ద నుంచి ఎక్కడికి సరుకు పోతోందో తేల్చడంలో మాత్రం పోలీసులు సక్సెస్‌ కాలేకపోయారు.. రఘుతేజ గత 15 నెలల్లో 202 సార్లు గోవాకు ఫ్లైట్‌లో వెళ్లి బస్సులో వచ్చాడని ఓ కేసులో కర్నాటక పోలీసులు తెల్చినట్లు సమాచారం. సైబరాబాద్‌ పోలీసులు మాత్రం అతను కేవలం ఒక వినియోగదారుడే అంటూ తప్పించారని అరోపణలు ఉన్నాయి. గతంలో సిట్‌ అధికారులు డ్రగ్స్‌ వినియోగించిన వారిపై కూడా కేసులు పెట్టి విచారించింది. ఇక్కడ అలాంటివి కనిపించడం లేదు. ఈడీ పిలిచి లెక్కలు తీసింది. కానీ సైబరాబాద్‌లో అలా లేదు. డ్రగ్స్‌ కేసు అంటే ఒక్క రోజు మీడియా హడావుడి చేస్తారు అని విమర్శలు ఉన్నాయి.

దందాలో ఫ్యామిలీ ప్యాక్‌ :
పెద్దలందరి పార్టీలకు అటెండ్‌ అవుతామని చెప్పకునే రఘుతేజ ఫ్యామిలీ ఇల్లీగల్‌ వ్యవహారాలను భార్యాభర్తలిద్దరు కలిసి నిర్వహిస్తారని తెలుస్తోంది.. భర్త రఘు దందాకు భార్య సహకరిస్తుందని వీరి బారిన పడిన బాధితులు చెబుతూ వుంటారు.. ఈ అక్రమ వ్యవహారాలు బయటకు రాకుండా కొందరు అధికారులకు విలువైన బహుమతులు ఇచ్చి కప్పిపుచ్చుతారని తెలుస్తోంది.. పిలవని పేరంటాలకు వెళ్లి.. అక్కడ పరిచయాలు పెంచుకుని.. ఆందరూ మా వాళ్లే అంటూ బిల్డప్‌ ఇవ్వడంలో వీరిని మించిన వారు లేరని అంటున్నారు. ఈ కుటుంబానికి సిటీలో తెలియని పబ్స్‌ లేవంటే అతిశయోక్తి లేదు.. ఎనీ టైం వారికి ఎంట్రీ ఉంటుందని సన్నిహితులు గుసగుసలాడుతుంటారు.. ఇలా పెంచుకున్న పరిచయాలతో ఎవ్వరికైనా ఫోన్‌ చేసి ఇట్లే మాట్లాడేస్తారని.. ఆ ధైర్యంతోనే పోలీసులు కూడా వారివైపు చూసే ధైర్యం చేయలేకపోతున్నారనే విమర్శలు ఉన్నాయి..

- Advertisement -

తేజ గురించి తెలియని నిజాలు ఎన్నో..?
రఘు తేజ అంటే అమాయకుడు, డ్రైవ్‌ ఇన్‌ ఫుడ్‌ కోర్టు పెట్టుకుని నడిపించుకునే ఒక సాధారణ వ్యక్తిలా కనిపిస్తాడు. కాని లోపల ఉన్న వ్యక్తి మరోలా ఉంటాడు. గోవాకు 202 సార్లు వెళ్లిన ఘనుడు ఏమి చేశాడు…? ఫ్లయిట్‌ లో గోవాకు వెళ్లడం.. బస్సులో తిరిగి రావడం వెనక మర్మం ఏంటి..? బిజినెస్‌ లో ఎవ్వరినీ నమ్మకుండా ఒక్కడే ఇలా చేస్తున్నాడంటే అర్ధం ఏమిటి..? ఎవరెవరికి డ్రగ్స్‌ సప్లై చేస్తున్నాడో.. రహాస్య చిట్టా ఎంటో ఇంకా భయటపడాల్సి ఉంది. రాజకీయ పార్టీలతో సంబందాలు లేకుండా సెలబ్రెటీలకు మాత్రమే డ్రగ్స్‌ అరేంజ్‌ చేసే కెపాసీటీ అతగాడికి వచ్చిందంటే.. ఎంత బ్యాక్‌ గ్రౌండ్‌ మెయింటెన్‌ చేస్తున్నాడో అర్ధం చేసుకోవచ్చు. ఈయన దందా గురించి తెలిసినా కొంత మంది పోలీసులకు, పోలిటిషన్స్‌, కొన్ని మీడియా సంస్థలకు నెల నెలా మాముళ్లు వెళ్లుతుండటంతో ఎవరూ బయటకు చెప్పడం లేదు. వీరి ఆడగాలకు కొత్తగా ఏర్పడిన యాంటీ నార్కోటిక్‌ పోలీసులు మాత్రమే చెక్‌ పెట్టాల్సి ఉందని.. వీరి ఇచ్చిన మత్తులో కూరుకుపోయిన బాధితులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్గానిక్‌ కూరగాల పేరుతో షాపు నడిపించే వ్యక్తి ఖుషీ, మరో వ్యక్తి సాయి ఎప్పటికప్పుడు ఇతగాడి చీకటి దందాలకు సహాయ సహాకారాలు అందిస్తారని నిఘా వర్గాలు రహస్యంగా అధారాలు రాబట్టినట్లు తెలుస్తోంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు