Friday, March 29, 2024

కుప్పకూలిన ఎయిర్ఫోర్స్ జెట్..

తప్పక చదవండి
  • కర్ణాటకలోని చామరాజనగర్ లో ఘటన..
  • ఇద్దరు పైలెట్లు సురక్షితం..
  • ప్రమాదంపై విచారణకు ఆదేశించిన అధికారులు..

ఎయిర్​ఫోర్స్​ జెట్ విమానం కర్ణాటకలో కుప్పకూలింది. ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. గురువారం ఈ ఘటన జరిగింది. పైలట్లు స్వల్పంగా గాయపడ్డారని అధికారులు తెలిపారు.. భారత వైమానిక దళానికి చెందిన వాయుసేన శిక్షణ విమానం ప్రమాదానికి గురయింది. భార‌త వైమానిక ద‌ళానికి చెందిన కిర‌ణ్ శిక్షణ విమానం క‌ర్ణాట‌క‌లో నేల‌కూలింది. కర్ణాటకలోని చామ‌రాజ‌న‌గ‌ర్‌లోని మాకాలి గ్రామంలో విమానం క్రాష్ అయ్యింది. అయితే ఆ విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు పారాచూట్ల సాయంతో క్షేమంగా బయటపడినట్లు తెలిసింది.ఇద్దరు పైలెట్లలో ఒకరు మహిళా పైలట్‌ ఉన్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై వాయుసేన అధికారులు విచారణకు ఆదేశించారు.

రోజువారీ శిక్షణ కార్యకలాపాల్లో భాగంగా వాయుసేనకు చెందిన కిరణ్‌ శ్రేణి విమానం బెంగళూరులోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరింది. బయలుదేరిన కొద్దిసేపటికే చామరాజనగర్‌కు సమీపంలోని బోగాపుర గ్రామంలోని బహిరంగ ప్రదేశంలో విమానం కూలిపోయింది. ఇద్దరు పైలట్లు తేజ్‌పాల్‌, భూమిక స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదం వెనుక కారణాలు తెలియాల్సి ఉంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు