Monday, November 4, 2024
spot_img

పాముకాటుతో విద్యార్థి మృతి..

తప్పక చదవండి
  • ఏపీలోని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రిలో నాగుపాము కలకలం సృష్టించింది.
  • బుధవారం ఉదయం ఆస్పత్రికి వచ్చిన రోగులకు ఓపీ విభాగం వద్ద పాము కనిపించడంతో రోగులు,
  • వారి కుటుంబీకులు సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.
    అందరూ బయటకు పరుగులు తీసి ఆసుపత్రి సిబ్బంది వెంటనే పాములు పట్టే వ్యక్తికి సమాచారం అందించడంతో అతడు వచ్చి పామును పట్టుకుని అటవీప్రాంతంలో విడిచిపెట్టాడు. ఇదే జిల్లాలోని పొందూరు మండలంలో పాముకాటుతో లవకుమార్‌ (14) అనే తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి మృతి చెందాడు. మండలంలోని తోలాపి ఎస్సీ కాలనీలో నివాసముండే దినసరి కూలీలు రావాడ చిన్నయ్య, నీలవేణిలకు రమ్య, లవ కుమార్‌ అనే ఇద్దరు పిల్లలున్నారు. తల్లి నీలవేణికి అనారోగ్యం కారణంగా శ్రీకాకుళం ప్రభుత్వాసుపత్రిలో శస్త్ర చికిత్స జరగడంతో ఆమె అక్కడే ఉంటుంది. కుటుంబ పోషణకు చిన్నయ్య ఇతర గ్రామానికి వెళ్లగా ఇంటిలో అక్క రమ్య, లవకుమార్‌ ఉంటున్నారు.
    అయితే రాత్రి నేలపై పడుకున్న సమయంలో కట్ల పాము కాటు వేసింది. అనంతరం మెడకు చుట్టుకోవడంతో లేచి దాన్ని గుర్తించి నేలపై పడేసి కర్రతో కొట్టి చంపివేశాడు. పాము కాటు వల్ల అనారోగ్యానికి గురికావడంతో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. అక్క డ చికిత్స పొందుతూ మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు