- ఆగష్టు 10లోపు వేతనాలు, ఏరియర్స్ చెల్లించాలి లేకుంటే 11 నుండి సమ్మె..
- జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా అనంతరం జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ గౌతమికి వినతిపత్రం..
- వివరాలు వెల్లడించిన దుంపల రంజిత్ కుమార్, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి..
గిరిజన హాస్టల్ వర్కర్స్ యూనియన్(సీఐటీయు ) ఆధ్వర్యంలో మంగళవారం రోజున జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసి, జిల్లా ట్రైనింగ్ కలెక్టర్ గౌతమి కి వినతి పత్రం, సమ్మె నోటీసు ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా దుంపల రంజిత్ కుమార్, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి గిరిజన ఆశ్రమ పాఠశాల, హాస్టల్లో పని చేస్తున్న డైలీ వైజ్, పార్ట్ టైం, అన్ని రకాల వర్కర్ల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైంది. నెల నెల రావాల్సిన వేతనాలు గత 8 నెలలగా ప్రభుత్వం వేతనాలు చెల్లించలేదు. పెరిగిన వేతనాల, పెండింగ్ ఏరియర్స్ కూడా ఇవ్వడం లేదు. గత కరోనా సమయంలో 42 రోజులు పని చేసిన వేతనం నేటికీ చెల్లించలేదు. ఒకవైపు ప్రతి రోజు నిత్యావసర ధరలు రోజు రోజుకి పెరుగుతుంటే, కుటుంబ పరిస్థితి, పిల్లల చదువులు, ఇంటి అద్దెలు కట్టుకోవడానికి ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వర్కర్ల పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ వేతనాలు, ఏరియల్స్ ఆగష్టు 10 లోపు చెల్లించాలి. లేకుంటే 11 నుండి పూర్తిగా విధులు బహిష్కరించి, సమ్మె లోకి వెళ్తున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.. ఈ కార్యక్రమంలో చందు, లక్ష్మణ్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, భీమయ్య, రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు, వెంకటేష్,జిల్లా సహాయ కార్యదర్శులు బక్కయ్య జిల్లా సలహాదారులు, వజ్రమ్మ, లక్ష్మీ, భాగ్య, జిల్లా కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.