Friday, May 3, 2024

గ్రూప్ 1 లో 1: 100 నిష్పత్తి తో ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల చేయాలి.

తప్పక చదవండి
  • డిమాండ్ చేసిన ఉచిత విద్య, వైద్య సాధన సమితి అధ్యక్షులు నారగొని ప్రవీణ్ కుమార్..

గ్రూప్ 1లో ఇదివరకు 1: 100 తీసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో 2003లో తీశారు. ఇటీవల పోలీసు నియామక బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్, ఎస్సై ప్రిలిమ్స్ లో కటాఫ్ తగ్గించి అభ్యర్థులకు న్యాయం చేయాలని కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత బట్టివిక్రమార్క అసంబ్లీలో అడిగితే ముఖ్యమంత్రి కూడా దీనికి అంగీకరించారు.. అలాగే కటాఫ్ తగ్గించి మెయిన్స్ కి ఎక్కువమందిని ఎంపిక చేసారు. కాబట్టి గ్రూప్ 1 లో కూడా ఎక్కువమందికి అవకాశం కల్పించాలని ఉచిత విద్య వైద్య సాధన సమితి డిమాండ్ చేస్తుంది. ఇందుకు గాను అధికార పక్షాన్ని ఇతర రాజకీయ పార్టీ నేతలు నిలతీయాలి.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2022లో క్వాలిఫై అయ్యి ఇప్పుడు నిర్వహించిన పరీక్షలో ఎవరైనా క్వాలిఫై కాకుంటే వాళ్ళు కచ్చితంగా కోర్ట్ లో కేస్ వేసే అవకాశం ఉందని, 2011 గ్రూప్ 1లో ఇంటర్వ్యూ లు పూర్తైన తర్వాత కూడా సుప్రీంకోర్టు తీర్పుతో 2016 లో మళ్లీ మెయిన్స్ రాయాల్సి వచ్చింది.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని అభ్యర్థులు ఆందోళనగా ఉన్నారు. 2022 ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన అభ్యర్థులు జూన్ లో మెయిన్స్ కి వెంటనే ప్రిపరేషన్ ప్రారంభించారు.. కానీ ఈ ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి తిరిగి వెంటనే మళ్ళీ నిర్వహించటం వల్ల ప్రిలిమ్స్ పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని, అందుకే పరీక్ష సరిగా రాయలేక పోయామని, తిరిగి అర్హత సాధించే అవకాశం తక్కువగా ఉందని అభ్యర్థులు ఆందోళనగా ఉన్నారు. మళ్ళీ నిర్వహించిన ప్రిలిమ్స్ లో 20కి పైగా ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవని అభ్యర్థులు చెబుతున్నారు.
అందుకే.. 11 సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి మేము అడుగుతున్న దానిలో న్యాయం ఉందని, అందరికీ న్యాయం చేసే విదంగా మెయిన్స్ కి 1:50 లో ఎంపిక చేస్తే 2022 లో ప్రిలిమ్స్ లో అర్హత సాధించిన వారిని, ఇప్పుడు (2023లో) ప్రిలిమ్స్ అర్హత సాదించబోయే వారిని కలిపి మెయిన్స్ కి ఎంపిక చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు. లేదంటే 1:100 తో ప్రిలిమ్స్ రిసల్ట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా జూన్ 11 న నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలో కూడా 20 పైగా ప్రశ్నలకు సరైన సమాధానాలు లేవని, వీటికి ఆధారాలతో సహా అభ్యoతరాలను టీ ఎస్ పి ఎస్ సీ కి అభ్యర్థులు సమర్పించారని, ఉచిత విద్య వైద్య సాధన సమితి ప్రభుత్వ దృష్టికి మరో మారు తీసుక వస్తుంది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు