Tuesday, September 10, 2024
spot_img

రూ.కోటి విరాళం..

తప్పక చదవండి
  • శ్రీశైలంలో ఆర్యవైశ్య నిత్యాన్నదాన భవనానికి విరాళం
    అందించిన మాజీ రాజ్యసభ సభ్యలు టి.జీ. వెంకటేష్..

శ్రీశైల మహా క్షేత్రంలో శ్రీ మల్లికార్జున అన్నసత్ర సంఘం, ఆర్యవైశ్య సేవాధామం ఆధ్వర్యంలో తెలంగాణ ఆర్యవైశ్య సంఘం నూతనంగా నిర్మించిన నిత్యాన్నదాన భవనానికి రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ లక్ష్మీవెంకటేశ్‌ కుటుంబ సభ్యులు రూ. కోటి విరాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గురువారం నిత్యాన్నదాన భవనం ప్రారంభ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం జరిగిన ఆత్మీయ సత్కార కార్యక్రమంలో టీజీ వెంకటేశ్‌ మాట్లాడారు. సేవా కార్యక్రమాలు చేసే వారికి తమ సహాయ సహాకారాలు ఉంటాయని అన్నారు. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రత్యేకంగా వివరించారు. ముఖ్యంగా యువత తప్పదోవ పడుతూ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని సూచించారు. టీజీ దంపతులు, ఆయన కుమారుడు టీజీ భరత్‌ను ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు శ్యాంసుందర్‌, ప్రధాన కార్యదర్శి శ్రీరాములు, కమిటీ సభ్యులు సన్మానించారు. భవన నిర్మాణానికి గతంలో 50 లక్షలు ఇవ్వగా మిగతా మొత్తాన్ని చెక్కు రూపంలో గురువారం కమిటీకి అందజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు